mt_logo

బద్మాష్ ప్రచారాలను చేస్తోంది కాంగ్రెస్: సీఎం కేసీఆర్

‘దళిత బంధు’ గురించి ఎన్నడైనా కాంగ్రెసోళ్లు ఆలోచించిండ్రా? వాళ్లకు ఆ పదమైనా వాళ్ల నోటికి వచ్చిందా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ‘షాద్ నగర్’ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. దళిత సోదరులకు అసైన్డ్ భూముల పట్టాలు ఇద్దామని నేనే చెప్పిన అని గుర్తు చేసారు. కాంగ్రెస్ దొంగలేమో ప్రతి ఊర్లో అసైన్డ్ భూములు గుంజుకుంటరని అబద్ధాలు ప్రచారం చేస్తున్నరు.గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరివైనా అసైన్డ్ భూములు గుంజుకున్నదా?. బద్మాష్ ప్రచారాలను చేస్తోంది కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేసారు. 

రైతుల నోటికాడ బక్కెత్తగొట్టాలె.. 

గెలిచిన తర్వాత మొదటి కేబినెట్‌లోనే అసైన్డ్ భూములను వారికే చెందేలా పట్టాలను ఇచ్చేసే మొదటి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.  రైతుబంధు వేయకుండా కాంగ్రెస్ నాయకులే ఎన్నికల కమిషన్‌కి వెళ్లి ఆపించిండ్రని అన్నారు. రైతుబంధు తీసుకునే కాంగ్రెస్ నాయకులకు సిగ్గు, మానం ఉందా? రైతుల నోటికాడ బక్కెత్తగొట్టాలె.. ధరణి తీసేస్తం..కరెంటు 3 గంటలే ఇస్తమని చెబుతున్న కాంగ్రెస్‌లో ఎట్లా ఉంటున్నరు? రైతుబంధు ఆపించిన కాంగ్రెస్‌తో తిరిగితే మీ కొంప కూడా కొల్లారం కాదా? నువ్వు రైతు వేనా? కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇవ్వాల గుండెల మీద చెయ్యేసుకొని చెప్పాలె అన్నారు. ఏదో నిషాలో పోయి ఇవ్వాల కాంగ్రెస్ అంటే రేపటి రోజున మీ కొంప కూడా మునుగుతది కదా? అని అడిగారు. కౌలురైతును రైతులకు దూలం లెక్క మెడకు కడుతానంటోంది కాంగ్రెస్. కట్టుకుంటారా రైతులు మరి అని సీఎం అడిగారు.