mt_logo

ఇందిరమ్మ రాజ్యంలో మత కల్లోలు, ఎన్ కౌంటర్లు: నాగర్‌కర్నూల్‌ సభలో సీఎం కేసీఆర్

దేశాన్ని, రాష్ట్రాన్ని 50 ఏండ్లు కాంగ్రెస్ పాలించింది. అప్పుడు ఏం జరిగిందో ఆలోచించాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తారట. ఇందిరమ్మ రాజ్యంలా మన్నుండెనా? అని సీఎం కేసీఆర్ అడిగారు. నాగర్‌కర్నూల్‌ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం మాట్లాడుతూ.. ఆకలి చావులు, ఇందిరమ్మ రాజ్యంలో మత కల్లోలు, ఎన్ కౌంటర్లు అయినాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ కోసం దీక్ష పట్టి పేగులు బయటకొచ్చేటట్లు ఉద్యమం చేసిందెవరు? ఆలోచించాలన్నారు. 

స్వాతంత్య్రం వచ్చి ఇన్ని రోజులైన రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి మన దేశంలో ఇంకా రాలేదని అన్నారు. కూరగాయలు కొంటె పుచ్చులు ఏరివేస్తం కదా? ఎమ్మెల్యేను ఎన్నుకునేటప్పుడు కూడా పనికిరాని వాళ్లను ఏరెయ్యాలని సూచించారు. అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల చరిత్ర గురించి ఆలోచించాలని తెలిపారు. పదేండ్ల కన్నా ముందు ఏముండే మన పరిస్థితి. పదేండ్లలో ఎంత మార్పు వచ్చిందో మీరు ఆలోచించాలని సీఎం అన్నారు. 

15 ఏండ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చినవాడిగా మీ క్షేమం కోరే వాన్ని కాబట్టి చెబుతాను. వట్టెం రిజర్వాయర్ నిర్మాణమవుతుంది. ఇది నిండితే నాగర్ కర్నూల్ జిల్లాకు నీళ్లు వచ్చి 40 వేల ఎకరాలకు నీరు వస్తుందని హామీ ఇచ్చారు. మంచిగా నడుస్తున్న తెలంగాణను కాపాడేదీ మీ చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. జనార్ధన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించండి. కారు గుర్తుకు ఓటేయ్యండి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేసారు.