mt_logo

15 ఏండ్లు పేగులు తెగేదాక కాంగ్రెస్‌తో కొట్లాడిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది: మానకొండూరు సభలో సీఎం కేసీఆర్

15 ఏండ్లు పేగులు తెగేదాక కాంగ్రెస్‌తో కొట్లాడిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని సీఎం కేసీఆర్ స్పష్టం చేసారు. మానకొండూరు ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ..  ఎలక్షన్లు వచ్చినయంటే మన దగ్గర ఒకటే హడావుడి. అమెరికాలాంటి దేశాల్లో బహిరంగ సభలు జరిగాయి. పార్టీ పాలసీపైనే ఓట్లు వేస్తరు. నియోజవకవర్గాల్లో గెలిచే అభ్యర్థులచే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతదని తెలిపారు. ఆ ప్రభుత్వం మంచిదైతే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో చెడ్డ ప్రభుత్వం ఏర్పడితే మన తలరాతను కింది మీద చేస్తుంది. మన ఓటే మనల్ని కాటేస్తుందని హెచ్చరించారు.    

నాటి ఇందిరమ్మ రాజ్యంలో అన్నమే లేకుండె అని గుర్తు చేసారు. ఇందిరమ్మ రాజ్యం మంచిగుంటే ఎన్టీ రామారావు పార్టీ ఎందుకు పెట్టిండు? ఆలోచించాలని సూచించారు. రెండు రూపాయల కిలో బియ్యం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎన్టీఆర్ వచ్చిన తర్వాత కదా కొంచెం పేదల కడుపు నిండింది.ఆనాడు మనోళ్లు చాలామంది సగం తిని, సగం పండుకున్నోళ్లని భాద పడ్డారు. ఇందిరమ్మ రాజ్యం సక్కగుంటే.. మనోళ్లు బొంబాయి, భీమండిలకు బతకనీకి ఎందుకు వలస పోయిండ్రు? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యమే సక్కగుంటే..హైదరాబాద్‌కో, బొంబాయికో పోయి కూలినాలి చేసుకునే గతెందుకు పట్టింది? ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీ పెట్టి అందరినీ పట్టుకపోయి జైళ్లేసుడు, ప్రభుత్వాలు కూలగొట్టుడేనా? ఉన్నోడు ఉన్నోడే ఉండె..లేనోడు లేకుండనే ఉండె ఇందిరమ్మ రాజ్యంల అని సీఎం బాధ వ్యక్తం చేసారు.