గజ్వేల్ నియోజకవర్గ విశ్వకర్మ, విశ్వ బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు, కేసీఆర్‌కు మీరంతా మద్దతు తెలపడం సంతోషకరం. కృతజ్ఞతలు పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదం లేదని ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ను కించపరిచేలా రేవంత్ రెడ్డి మాట్లాడారు. జయశంకర్ సార్ ప్రజల మనుసులో నుండి పుట్టించారు ఆ నినాదాన్ని.జయశంకర్ సర్ ఆశయాల స్పూర్తితో కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని స్పష్టం చేసారు.
తెలంగాణ తొలి సీఎం ఎవరు అంటే గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అంటారు. గజ్వేల్‌కు గొప్ప పేరు ఉంది. ఇంకా చేస్తారని తెలిపారు. ఈటెల రాజేందర్ తిన్నింటి వాసాలు లెక్కబెట్టారు. అన్నం పెట్టిన చెయ్యికి సున్నం పెట్టిండని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన్ని ఎమ్మెల్యే చేసింది, మంత్రి చేసింది, శాసనసభ పక్ష లీడర్ చేసింది కేసీఆర్ అని వెల్లడించారు. దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికీ పథకం అందేలా చూస్తామని చెప్పారు. బీజేపీకి ఓటు వేసినా మోరీలో ఓటు వేసినా ఒక్కటే అని ఎద్దేవా చేసారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా గెలిపిస్తే గజ్వేల్ పేరు మరోసారి మారు మోగుతుంది. చరిత్ర సృష్టిస్తుంది. అందుకు అందరం కృషి చేయాలని కోరారు. ప్రజ్ఞాపూర్‌కు చెందిన పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు.