mt_logo

పాలమూరు నుంచి కల్వకుర్తికి నీళ్లిచ్చే బాధ్యత నాది: కల్వకుర్తి సభలో సీఎం కేసీఆర్

పాలమూరు నుంచి కల్వకుర్తికి నీళ్లిచ్చే బాధ్యత నాదని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కల్వకుర్తి ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో మహబూబ్‌నగర్ జిల్లాకు పెండింగ్ ప్రాజెక్టుల జిల్లాగా, వెనుకబడ్డ జిల్లాగా పేరు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసారు. కాంగ్రెస్ 50 సంవత్సరాల కాలంలో అనేక బాధలు పడ్డాం. సాగు నీళ్లు లేవు. తాగునీళ్లు లేవు. పేదరికం, వలసపోవడం. లంబాడీ బిడ్డలు వచ్చి హైదరాబాద్‌లో ఆటోలు నడుపడం, ఇలాంటి కష్టాలెన్నో ఉండేవని గుర్తు చేసారు. కల్వకుర్తిలో  రెండున్నర లక్షల  ఎకరాలకు నీళ్లు వస్తాయని సీఎం వెల్లడించారు. 

మీ దగ్గర నుంచి రింగ్ రోడ్డు వస్తుంది. లంబాడీ తండాలను 40 గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నాం అని తెలిపారు. ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తానంటున్నారు కాంగ్రెస్ వాళ్లు అని హెచ్చరించారు. కౌలు దారులకు, భూ యజమానులకు పంచాయతీ పెట్టే పరిస్థితి తెచ్చేలా కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ రాజ్యం వస్తే దళారి రాజ్యం తెస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు. ఓటు మంచి వాళ్లకు వేస్తే మంచి జరుగుతదని తెలిపారు. 

బీసీలకు రానికాడా టికెట్లు రాకనేపాయే. వచ్చిన కాడ గెలిపించుకోవాలే అని కోరారు. గంపెడు బీసీలు ఉన్నరు.  జైపాల్ యాదవ్ ఎట్లా ఓడిపోతడు అని ప్రశ్నించారు. ఇటువంటి వ్యక్తి గెలిపిస్తే లాభం జరుగుతది అని అన్నారు. పాలమూరు నుంచి కల్వకుర్తికి నీళ్లిచ్చే బాధ్యత నాదని మాట ఇచ్చారు. లక్షా 50 వేల ఎకరాలకు నీళ్చిచ్చే బాధ్యత నాదన్నారు. కొత్త మండలాలు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.