mt_logo

ఓట్ల కోసం లంగ మాటలు చెప్పం: చేర్యాల సభలో సీఎం కేసీఆర్

ఓట్ల కోసం లంగ మాటలు చెప్పం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చేర్యాల ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో  2 వేల పింఛన్ ఉంటే నేల ముక్కుకు రాస్తా అని సీఎం కేసీఆర్ అన్నారు. తీర్థం పోదాం తిమ్మక్క ఉంటే వాడు గుళ్లె. మనం సల్లే అన్నట్లుంటుంది కాంగ్రెస్ వ్యవహారం అని ఎద్దేవా చేసారు. మనం ఏమైనా హౌలాగాల్లలాగా కనబడుతున్నామా? వాస్తవాలు ముందుంచుకుని గోల్ తిప్పుదామంటే మనం గోల్ అవుతమా? అని అడిగారు. 

కాంగ్రెసోళ్లవి గజకర్ణ గోకర్ణ విద్యలు 

కాంగ్రెస్  పాలించే రాష్ట్రాల్లో సాగునీటికి పన్ను ఉంది. మన దగ్గర లేదని స్పష్టం చేసారు. రైతుబంధు పదం పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్ అని వివరించారు. ఇంకో 15 ఏళ్లు ఇదే పద్ధతిన నడిస్తే రైతులు బాగుపడుతారని సూచించారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు వెనుకబడ్డ ప్రాంతమని కాంగ్రెస్  లేబుల్ వేసింది. పంజాబ్‌ను తలదన్ని మూడు లక్షల టన్నుల వడ్లు పండించింది తెలంగాణ. వడ్ల కుప్పలు ఎక్కడ నుంచి వచ్చినయి కాంగ్రెస్ వోడి అయ్య తెచ్చిండా..? కండ్ల ముందు కనబడుతున్నప్పటికీ మాయామశ్చీంద్ర చేస్తాం. గజకర్ణ గోకర్ణ విద్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లు. మనమేమైనా పిచ్చోళ్లమా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను చూస్తే  వారికి భయం వేస్తుందా? అని సీఎం నిలదీశారు.