mt_logo

రైఫిల్ రెడ్డి (రేవంత్ రెడ్డి) తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిండు: చేర్యాలలో సీఎం కేసీఆర్

తెలంగాణ ఏర్పడ్డాక ఎన్నికలు మూడోసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దని సూచించారు.  చేర్యాల ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం మాట్లాడుతూ.. రాజేశ్వర్ రెడ్డి మస్తు రంది పడుతుండు. వాడెవడో వచ్చి జనగామకు వచ్చి వొర్రిపోయిండంట. కుక్కలు మస్తుగా మొరుగుతాయి. లెక్క బెడతమా? జనగామలో  మొరిగిపోయిన కుక్క కరీంనగర్‌లో రైఫిల్ పట్టుకుని  ఎవడ్రా తెలంగాణ ఉద్యమం చేసేదని  ఉద్యమకారులపైకి వెళ్లిండని గుర్తు చేసారు. ఆ రోజు నుంచి వాడి పేరు రైఫిల్ రెడ్డి అని పేరు పెట్టిండ్లు అని వెల్లడించారు. వీళ్లొచ్చి మాట్లాడుతామంటే వాళ్లకు  సిగ్గు కూడా ఉండాలి కదా కనీసం అని అన్నారు. నువ్వు ఆంధ్రోళ్ల బూట్లు మోసుకుంటా ఉండి, ఆ రోజు చంద్రబాబునాయుడికి చెంచాగిరి చేసుకుంటా ఉన్నావు. తెలంగాణ ఉద్యమకారులను, ఆమరణ దీక్ష పట్టిన కేసీఆర్ ను తిడుతానంటే మర్యాదనా? ఇది అని సీఎం అడిగారు. 

ఎన్ని బాధలు పడ్డా.. ఏ గాడిద కొడుకైనా మాట్లాడిండా? 

కేసీఆర్‌కు పిండం పెడుతా అంటడు-ఎవనికి పిండం పెట్టాల్నో మీరు నిర్ణయించాలని కోరారు. ఇది రాజకీయమా. మర్యాదనా. ఏదో సభ పెట్టుకుని నువ్వు చెప్పేదేదో నాలుగు మాటలు చెప్పుకో..నీ పార్టీ పాలసీ చెప్పుకో అన్నారు. ఓడిపోతామనుకునేటోడే  ఈ మొరుగుడు మొరుగుతడు అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రాజ్యంలో ఎన్ని బాధలు పడ్డం. ఎన్ని ఏడుపులు పడ్డం. ఏ గాడిద కొడుకైనా మాట్లాడిండా?  తెలంగాణను గొడగొడ ఎడ్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తేల్చి చెప్పారు.