mt_logo

ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఆకలి చావులే: అలంపూర్ సభలో సీఎం కేసీఆర్

ప్రజాస్వామ్యంలో ఫ్యాక్షనిస్టులు అవసరం లేదని సీఎం కేసీఆర్ సూచించారు. అలంపూర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జోగులాంబ అమ్మవారి దేవస్థానం అద్భుతమైన శక్తి పీఠాల్లో ఐదవ స్థానం. తెలంగాణకు అలంపూర్‌కు జరుగుతున్న అన్యాయం మీద అలంపూర్ నుంచి గద్వాల వరకు పాదయాత్ర చేసింది మీకందరికి తెలిసిందే అని వ్యాఖ్యానించారు. మీలో చాలా మంది యాత్రలో పాల్గొన్నారని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఫ్యాక్షనిస్టులు అవసరం లేదన్నారు. మత్పరించేటోళ్లు అవసరం లేదు.

బోయలను బీసీల్లో కలిపింది కాంగ్రెస్

కాంగ్రెస్ నాయకులు పదవులు వస్తే వారి స్వార్ధానికి వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అన్యాయాలు చెబితే చాలా బాధ అనిపిస్తుంది. బోయలను బీసీల్లో కలిపింది కాంగ్రెస్ వాళ్లే. వాల్మికి బోయలకు హామీ ఇస్తున్నా. గిరిజనులుగా ప్రకటించే వరకు కేంద్రంతో పోరాడుతా అని హామీ ఇచ్చారు. ఆర్డీఎస్ దాకా పోయి చూసి వచ్చి పోరాటం తప్ప దారిలేదని దానిమీద మొదలు పెట్టినాం అని తెలిపారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని ఉండే ఆయన మాట్లాడిండు. కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గి ఆర్డీసీ తూములు మూసేస్తే బాంబులు పెట్టి పేల్చేస్తామని అన్నడు. నాకు కోపం వచ్చి నేను చెప్పినా.. రాజశేఖర్ రెడ్డి నీకు ఆరు చేతులు ఇవ్వలేదు. ఆర్డీఎస్ బద్దలు కొట్టి చూడు. సుంకేశుల బరాజ్‌కు 100 బాంబులు పెట్టి లేపేస్తామని చెప్పిన అని పేర్కొన్నారు. 

ఇందిరమ్మ రాజ్యంలో పేదలను పట్టించుకున్నోడు లేడు 

మాకు కూడా బాంబేసే మొగోడు పుట్టిండని ప్రజలు మాట్లాడుతున్నారని చెప్పిండ్లు. ఆనాడు తూములను బద్దలు కొట్టి తీసుకుపోతుంటే మాట్లాడినోడు లేడు. బోయలను బీసీల్లో కలిపితే మాట్లాడినోడు లేడు, పెండింగ్ లో ప్రాజెక్టులు పెడితే మాట్లాడినోడు లేడు, ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఏమయింది మన బతుకు అని అడిగారు. చేసింది చాలక కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారు కాంగ్రెస్‌లో ఆకలి బతుకులు. ఎన్టీఆర్ వచ్చి రెండు రూపాయల బియ్యం ఇచ్చే రాక ఇబ్బందులయ్యాయి.  ఇందిరమ్మ రాజ్యంలో పేదలను పట్టించుకున్నోడు లేడు. ఆకలి తీర్చినోడు లేడని ధ్వజమెత్తారు. పొలాలకు నీళ్లిచ్చే సోయిలేదు. తెలంగాణను ఆగం పట్టించి బతుకులు నాశనం చేసిండ్లు అని ఆవేదన వ్యక్తం చేసారు. పేద కుటుంబం నుంచి విజయుడు వచ్చాడు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన విజయున్ని గెలిపించండి, కారు గుర్తుకే ఓటేయ్యండని సీఎం కేసీఆర్ కోరారు.