mt_logo

కరెంటు కావాల్నా.. కాంగ్రెస్ కావాల్నా? రైతుబంధు కావాల్నా.. రాబందు కావాల్నా?: సీఎం కేసీఆర్

కరెంటు కావాల్నా..కాంగ్రెస్ కావాల్నా? రైతుబంధు కావాల్నా..రాబంధు కావాల్నా? అని సీఎం కేసీఆర్ అడిగారు. ఆదిలాబాద్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. పట్టణ, గ్రామీణ జనాభా కలసి చైతన్యం చాలా ఎక్కువ ఉన్న ప్రాంతం ఆదిలాబాద్ అని వెల్లడించారు. ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలే కాదు..వారి వెనుకున్న పార్టీల గత చరిత్ర చూసి, ఆలోచించి ఓటెయ్యాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అని తెలిపారు.  మీరిచ్చిన ఆశీర్వాదంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తా వున్నదని అన్నారు. 

కత్తి ఒకరికి ఇచ్చి.. వేరొకరిని యుద్ధం చేయాలంటే ఎలా? 

జోగు రామన్న గెలిస్తేనే రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంటు వస్తదని వివరించారు. మన పరంగా ఎవరు యుద్ధం చేస్తరో వాళ్ల చేతిలో కత్తి పెడితేనే మనం గెలుస్తం. కత్తి ఒకరికి ఇచ్చి.. వేరొకరిని యుద్ధం చేయాలంటే’ సాధ్యం కాదు.ఎమ్మేల్యేలు గెలిస్తేనే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతదని పేర్కొన్నారు. ఓటు వేరేవాళ్లకి వేసి, పనిచేయమంటే జోగు రామన్న ఎట్ల చేస్తడు? అని అడిగారు. 

ప్రజల వైపే కేసీఆర్ 

రైతుల భూములు ఆగం కావొద్దని ధరణి’ తెచ్చామని చెప్పారు. దుర్మార్గులు వచ్చి ధరణి’ తీసేస్తే..కైలాసం ఆటల పెద్దపాము మింగినట్లే అయితదని హెచ్చరించారు. పీసీసీ  అధ్యక్షుడేమో 3 గంటల కరెంటు చాలని, 10 హెచ్.పి. మోటర్ కావాలంటడు. రైతులు వాడేదే 3 లేదా 5 హెచ్.పి. మోటార్లు.లంగాణలో 30 లక్షల మోటార్లున్నయ్. అన్ని 10 హెచ్.పి. మోటార్లు ఎవరు కొనియ్యాలె? అని  ప్రశ్నించారు.  ప్రజల వైపే కేసీఆర్ ఉంటడు.. 24 గంటల కరెంటు ఇస్తడని హామీ ఇచ్చారు. 

కాంగ్రెస్ ఏమి పట్టించుకోలే..

కరెంటు కావాల్నా..కాంగ్రెస్ కావాల్నా?, రైతుబంధు కావాల్నా..రాబంధు కావాల్నా?.. ఏది కావాల్నో ప్రజలు చర్చబెట్టి నిర్ణయించుకోవాలని కోరారు. 50 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికల్లో ‘లోయర్ పెన్ గంగా’ అని ఊరిచ్చిండ్రు. ఏనాడు చేయలేదని ధ్వజమెత్తారు. ఆదిలాబాద్ చరిత్రలో ఒక్కడే ఒక్క జోగు రామన్న తన మాట నిలబెట్టుకొని ‘చనాకా-కొరాట బ్యారేజ్’ చేయిస్తా ఉన్నడు. పనులు పూర్తి కావొచ్చినయ్. చనాకా-కొరాట కాలువ తో దాదాపు 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీనిని పిప్పల కోటి రిజర్వాయర్‌కు కూడా లింక్ ఇచ్చుకుంటే బ్రహ్మాండమైన అభివృద్ధి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ ఏమి పట్టించుకోలేదో.. వాటన్నింటినీ బీఆర్ఎస్ పార్టీ సక్కదిద్దుతావున్నదని అభివర్ణించారు.