- సీఎం కప్ నిర్వహణ విధివిధానాల పై ఉన్నత స్థాయి సమీక్ష..
- సీఎం కప్ క్రీడల నిర్వహణ కు సీఎం కేసీఆర్ గారు 3 కోట్ల 60 లక్షల రూపాయల ను మంజూరు
- నూతనంగా 76 క్రీడా మైదానాల ఏర్పాటుకు అనుమతులు
- సీఎం కప్ అంతర్జాతీయ మానసిక వికలాంగుల క్రికెట్ మ్యాచ్
హైదరాబాద్: సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో నూతనంగా 76 క్రీడా మైదానాల ఏర్పాటుకు అనుమతులను ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో 50 శాతం స్టేడియాలను పూర్తి చేసామని అన్నారు. సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దాదాపు 19 వేల గ్రామాలు, పట్టణాలలో క్రీడా ప్రాంగణాలను దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నిర్మిస్తున్నామని అన్నారు. ఇప్పటికే 15 వేల పై చిలుకు క్రీడా ప్రాంగణాలను పూర్తి చేసామన్నారు. దీనివల్ల గ్రామీణ క్రీడా కారులను ప్రోత్సహించేందుకు గాను దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కప్ ను క్రీడా పోటిలు గ్రామీణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని సమీక్షలో వెల్లడించారు.
ప్రభుత్వ ఉద్యోగాలలో 2 శాతం, ఉన్నత విద్య అభ్యాసం కోసం 0.5 శాతం రిజర్వేషన్లు అమలు
సీఎం కప్ క్రీడల నిర్వహణ కు సీఎం కేసీఆర్ గారు 3 కోట్ల 60 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. క్రీడాకారులకు, కోచ్ లకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు.క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 2 శాతం, ఉన్నత విద్య అభ్యాసం కోసం 0.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు నగదు పురస్కారాలను గణనీయంగా పెంచాము, ఎంతో విలువైన జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను కేటాయించామన్నారు.CM KCR గారి ఆదేశాల మేరకు దేశానికి తెలంగాణ నుండి ఎక్కువ సంఖ్యలో క్రీడాకారులను అందించడమే లక్ష్యం అని, గత ఒలంపిక్స్, కామన్వెల్త్ క్రీడల్లో తెలంగాణకు చెందిన క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ ను కనపర్చారని అన్నారు. సీఎం కప్ నిరంతరం కొనసాగేలా విధి విధానాలు రూపొందించాలని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఆదేశం. రాష్ట్ర క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్, తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్, వివిధ క్రీడా సంఘాల అసోసియేషన్లు, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATS) ఉన్నతాధికారులు సీఎం కప్ నిర్వహణలో కీలక భూమిక పోషించాలని అన్నారు. సీఎం కప్ నిర్వాహణ పై జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు పై రేపు జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్, సీఎం కప్ ఈనెల 13న లోగో ఆవిష్కరణ, మరియు 18 క్రీడాంశాలలో సీఎం కప్ నిర్వహణ. సీఎం కప్ నిర్వహణ లో ఈ నెల 15 నుండి 17 వరకు జరిగే మండల స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీలలో స్థానిక ఎమ్మెల్యే లను భాగస్వామ్యం చేయాలన్నారు.
ఈనెల 18న హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశం
సీఎం కప్ నిర్వాహణ, విజయవంతం చేయడంపై రాష్ట్రానికి చెందిన అర్జున, పద్మశ్రీ, ద్రోణాచార్య, పద్మభూషణ్, పద్మ విభూషణ్ క్రీడా అవార్డులు సాధించిన క్రీడాకారులతో, క్రీడా ప్రమోటర్లతో ఈనెల 18న హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 22న జిల్లా స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో జిల్లాకు చెందిన ఇంచార్జ్ మంత్రిని భాగస్వామ్యం చేయాలి, 29న జరిగే సీఎం కప్ ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించాలన్నారు. సీఎం కప్ అంతర్జాతీయ మానసిక వికలాంగుల క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – క్రీడా శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ విజయవంతం చేయడానికి వివిధ కమిటీల నియామకం చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఉన్నతాధికారులు నియామకం
సీఎం కప్ నిర్వహణ లో క్రీడాకారులకు అవసరమైన పలు కీలక కమిటీలైన ఫుడ్ కమిటీ, వసతి ఏర్పాటు, రవాణా సౌకర్యం, సీఎం కప్ ప్రారంభ ఏర్పాటు పై జాతీయ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నియామకం, సాంకేతిక సహాయం కోసం తెలంగాణ ఒలంపిక్ కమిటీ నియామకం, స్టీరింగ్ కమిటీలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATS) ఉన్నతాధికారులు నియామకం, సీఎం కప్ విధి విధానాలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో క్రీడా శాఖ అధికారులకు, వివిధ క్రీడా సంఘాల అసోసియేషన్లకు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ దిశ నిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.