mt_logo

దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ

తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మరో ఘనతను సొంతం చేసుకుంది. గ్రామ పంచాయితీల ఆన్లైన్ ఆడిటింగ్ లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది. గత ఏడాది కూడా ఈ విభాగంలో మొదటి స్థానంలో నిలవగా.. అదే ఒరవడి ఈ ఏడాది కూడా కొనసాగించి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖను అభినందిస్తూ లేఖ రాసింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రెటరీ సేథీ, ఇందుకు సంబంధించిన వివరాలను ఆ లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఆన్లైన్ ఎడిటింగ్ లో తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు లీడ్ రోల్ పోషిస్తున్నట్లు ఆ లేఖలో అభినందించారు. కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల వినియోగంపై ఎప్పటికప్పుడు ఆడిటింగ్ నిర్వహిస్తున్నది. 2020-21 వ సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగం విషయమై ఆన్లైన్ ఆడిటింగ్ నిర్వహిస్తూ అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జారీ చేసింది. వాటికనుగుణంగా ఆయా రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలు తాము చేసిన నిధుల ఖర్చును ఆన్లైన్ లోనే అందిస్తున్నది. ఈ విధంగా నిర్ణీత గడువు కంటే ముందే 100 శాతం ఆన్లైన్ ఎడిటింగ్ పూర్తిచేసిన తెలంగాణ, దేశంలో నెంబర్ వన్ గా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో 72 శాతంతో తమిళనాడు, 60 శాతంతో ఆంధ్ర ప్రదేశ్ దేశ్, 59% తో కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రాలు 25 శాతానికి లోపే ఆన్లైన్ ఎడిటింగ్ పూర్తి చేసి వెనుకబడ్డాయి. కాగా 2019-20 సంవత్సరానికి 14వ ఆర్థిక సంఘం నిధులు వినియోగంపై నిర్వహించిన ఆన్లైన్ ఆడిటింగ్ లో కూడా తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలవడం విశేషం.

హర్షం వ్యక్తం చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు :

సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన పల్లె ప్రగతి పథకాలు, మంత్రి కేటీఆర్ డైనమిక్ లీడర్ షిప్ మన పల్లెలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్ర నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికికి బాటలు వేశారన్నారు. బాపూజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కేవలం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో సాధ్యమవుతుందని చెప్పారు. చిన్నచిన్న గ్రామపంచాయతీలకు కూడా కనీసం ఐదు లక్షల రూపాయలు అందే విధంగా చూస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, డంప్ యార్డ్, స్మశాన వాటిక, కళ్ళాలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, హరిత హారం కింద మొక్కలు వచ్చాయన్నారు. నిరంతర పారిశుద్ధ్యం కొనసాగుతుండటం వల్లె రాష్ట్ర గ్రామీణ పల్లెలు దేశానికి పట్టుకొమ్మలుగా మారాయని అన్నారు. అందుకే కరోనా వంటి ఉపద్రవాలను సైతం తెలంగాణ రాష్ట్రం ఎదుర్కోగలిగిందని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవార్డులు రివార్డులు ఇవ్వడంతో సరిపెట్టుకోకుండా కాస్త నిధులు ఎక్కువగా ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మరింతగా ప్రోత్సహించాలని ఎర్రబెల్లి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నిర్దేశాలు కనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఉద్యోగులు అద్భుతంగా పని చేస్తున్నారని, అందువల్లే ఇలాంటి ప్రతి ఫలాలు లభిస్తున్నాయని వారిని అభినందించారు. ఇకముందు కూడా ఇలాగే పని చేసి పంచాయతీరాజ్ శాఖకి మంచి పేరు తేవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.

పంచాయతీరాజ్ శాఖ సిబ్బందిని అభినందించిన హరీష్ రావు :

ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ, నిధులను సద్వినియోగం చేసుకుంటూ, ఆన్లైన్ ఆడిటింగ్ లో కూడా నెంబర్ వన్ గా నిలుస్తూ మన గ్రామ పంచాయతీలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అభినందించారు. ఇదే ఒరవడిని కొనసాగించవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. అడిటింగ్ అధికారులు వందకు వంద శాతం ఆడిటింగ్ నిర్వహించి రాష్ట్రాన్ని ప్రధమ స్థానంలో నిలిపారని అభినందించారు. ఇదే రీతిలో స్థానిక సంస్థల అన్నింటిలో ఆన్ లైన్ ఆడిటింగ్ చేపట్టాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *