mt_logo

పార్టీ అధ్యక్షుడిని మార్చినా, ఔట్ డేటెడ్ లీడర్లను చేర్చుకున్నా.. మూడోసారి బీఆర్ఎస్ ప్రభంజనమే.. 

 సీఎం కేసీఆర్ ది ప్రజలతో పేగు బంధం,  ఫెవికాల్ బంధం, కాంగ్రెస్ బీజేపీ లది ఫేక్ బంధం

సంగారెడ్డి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్ ప్రభు గౌడ్, వైస్ చైర్మన్ ఖాజా ఖాన్, డైరెక్టర్ లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..  ఉద్యమంలో పని చేశారు, పార్టీని నమ్ముకున్న వారికి పదవులు వస్తుండటం సంతోషకరం అన్నారు. సీఎం గారు ప్రారంభించిన రైతు కార్యక్రమాలు వారికి చేరువ చేయాలి, సంగారెడ్డి జిల్లాలో సాగు నీటి కోసం బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులు 4400 కోట్లతో ప్రారంభించారు. ఈ రెండు ప్రాజెక్టులతో 3.80 లక్షల ఎకరాలకు సాగు నీరు వస్తుంది. సంగారెడ్డి కి మెడికల్ కాలేజీ వచ్చింది అంటే సీఎం కేసీఆర్ వల్లనే అన్నారు. 

ఒకరు అధ్యక్షుడిని మార్చినా, మరొకరు ఔట్ డేటెడ్ లీడర్లను చేర్చుకున్నా..వచ్చే ఎన్నికల్లో ముమ్మాటికీ మూడోసారి బీ ఆర్ ఎస్ ప్రభంజనమే.. 

కేసీఆర్ కు ప్రజలకు మధ్య ఉన్న బంధం పేగు బంధం, ఫెవికాల్ బంధం. కాంగ్రెస్ బీజేపీ లది ఫేక్ బంధం అన్నారు. ఒకరు అధ్యక్షుడిని మార్చినా, మరొకరు ఔట్ డేటెడ్ లీడర్లను చేర్చుకున్నా.. వచ్చే ఎన్నికల్లో ముమ్మాటికీ మూడోసారి బీఆర్ఎస్ ప్రభంజనమే.. మీరు అధికారంలో ఉండే రాష్ట్రాల్లో 4000 పింఛన్ ఇచ్చి మాట్లాడండన్నారు. తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ బీఆర్ఎస్. కోచ్ ఫ్యాక్టరీ అంటే, వాగన్ ఫాక్టరీ ఇచ్చారు. 20 వేల ఫ్యాక్టరీ బదులు, 500 కోట్లది ఇచ్చారు. గుజరాత్ కు ఎందుకు ఇస్తారు, తెలంగాణకు ఎందుకు ఇవ్వరు అని అడిగారు. దక్షిణ భారత దేశం మీద బీజేపీ సవతి తల్లి ప్రేమ అన్నారు. మా పార్టీకి ప్రజలే హై కమాండ్, వాళ్లకు ఢిల్లీ హై కమాండ్. మన ఆత్మగౌరవం మన చేతుల్లో ఉండాలి. కార్యకర్తలు గట్టిగా పని చేయండి. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీదే అని తెలిపారు.