
బీజేపీ ఇచ్చింది కేవలం శుష్క ప్రియాలు, శూన్య హస్తాలే అని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. పటాన్‌చెరులో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్, ఫ్రీడం పార్కులను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కోచ్ ఫ్యాక్టరీ తన్నుకుపోయారు. దక్షిణ భారత దేశం అభివృద్ధిలో బీజేపికి చిన్న చూపు ఎందుకు? అని ప్రశ్నించారు. బీజేపి దక్షిణాది రాష్ట్రాలకు ఏమైనా ఇచ్చిందా? అంటే అది కేవలం శుష్కప్రియాలు, శూన్య హస్తాలు మాత్రమే అని ఎద్దేవా చేసారు. ఆల్ రిజెక్ట్ లీడర్లను, స్క్రాప్ రాజకీయ నేతలను, పక్కకు పెట్టిన వారిని పార్టీలోకి తీసుకుని ప్రతిపక్ష పార్టీలు జబ్బలు చరుచు కోవడం సిగ్గుచేటన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. మళ్లీ గెలిచిన వెంటనే పటాన్ చెరు కు మెట్రో రైలు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేసారు.