ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టనున్న స్థానిక సంస్థల సవరణ బిల్లుపైన బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. శాసనసభలో తీసుకువచ్చిన బిల్లులలో ఎక్కడా కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించకపోవడంపైన పార్టీ తమ నిరసన వ్యక్తం చేసింది.
42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించేలా సవరణలకు ప్రతిపదన చేయనున్ననట్లు పార్టీ తెలిపింది. ఈమేరకు చట్ట సవరణకు సంబంధించిన నోటీసును ఇవ్వనున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది.
సవరణలకు ప్రభుత్వం అంగీకరించకుంటే సభలో ఓటింగ్ డివిజన్ నిర్వహించాలని కోరుతాం అని స్పష్టం చేసిన బీఆర్ఎస్.. నవంబర్‌లోగా జనగణన పూర్తి చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, దానిని తేల్చకుండా చట్ట సవరణకు అసెంబ్లీలో ప్రయత్నం చేయడంపై అభ్యంతరం తెలిపింది
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ హామీని లేవనెత్తిన బీఆర్ఎస్.. 50% పైగా ఉన్న బీసీ జనాభాకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా ఈ చట్ట సవరణ తీసుకువస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడింది.
చట్టాలలో తమకు కావాల్సిన అనేక సవరణలను ప్రతిపాదించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రస్తావించకపోవడం బీసీలను మోసం చేయడమే అని పేర్కొన్నది.