mt_logo

దేశం మొత్తం మార్పు తేవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ఆవిర్భవించింది: సీఎం కేసీఆర్‌

నాందేడ్‌: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నాందేడ్ పర్యటనకై శుక్రవారం ప్రగతి భవన్ నుంచి  ఉదయం 11.40 గంటలకు బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి ప్రత్యేక విమానంలో నాందేడ్ బయలుదేరి వెళ్లారు. నాందేడ్ పట్టణానికి చేరుకున్న ముఖ్యమంత్రి  అక్కడి నుండి శిక్షణా శిభిరం ఏర్పాటు చేసిన అనంత్ లాన్స్ కు వేదిక వద్దకు చేరుకున్నారు. బీఆర్ఎస్‌ పార్టీ శిక్షణ శిబిరాన్ని సీఎం కేసీఆర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.అనంతరం ఆయన బీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. నాందేడ్‌ వ్యాప్తంగా కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు వెలిశాయి. శిక్షణ శిబిరం నిర్వహించే అనంత్‌లాన్స్‌ వేదిక మొత్తం గులాబీ మయమైంది. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు శిక్షణా శిబిరాలకు తరలివచ్చారు. మహరాష్ట్రలో బీఆర్ఎస్ లో చేరిన ఇతర పార్టీల ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు. 

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు: 

మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ కమిటీలు వుండాలి. జెండాలు ఎగరాలి. శివాజీ మహారాజ్ గారిది ఈ ప్రదేశం, డా.బిఆర్ అంబేడ్కర్ ఇక్కడి వారే… ఇంకా ఎందరో మహానుభావులు పుట్టిన  గడ్డ ఇది,  బుద్దిజీవుల దేశం ఇది. ఆటోలు, టాక్సిలు, ఇతరత్రా ఉపయోగానికి స్టిక్కర్లు, మంచిగా కనపడేటట్లు, పాటలు విన్నారు కదా? మంచిగా వున్నాయి కదా? ఇంకా వేల పాటలు తయారు చేద్దాం అన్నారు.  ఇంకా చాలా కేసెట్లు తీద్ధాం ప్రతినెల, సోషల్ మీడియా, యూట్యూబ్ జమానా నడుస్తున్నది ఇప్పుడు.మొదటగా మీ ఫోన్లలో వేసుకోండి… తరువాత  మీ ఊర్లల్లోని  వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మహరాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జి దేశ్ ముఖ్  వుంటాడన్నారు. పదాదికారులు నియమించుకోవాలి. కోట్లు పెట్టి కొంటున్నాము. వాటిని ఒక లక్ష్యంతో కొంటున్నామన్నారు. లక్ష్యాన్ని చేధించాలన్నారు.  దేశంలో మార్పు కోసమే బీఆర్ఎస్.. ఒక ఉన్నతమైన లక్ష్యంతో పనిచేస్తున్నాం..మనసుతో పనిచేయాలి.  రెండు రాష్ట్రాలు వేల కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. కృష్ణా, గోదావరి నదులు పుట్టిన మహారాష్ట్రలో నీటి కొరత ఎందుకని ఆయన ప్రశ్నించారు.1 లక్షా 40 వేల మంది టిఎంసీల వర్షం కురుస్తుంది,  కానీ ఇందులో సగం (70 టీఎంసీల నీరు) ఆవిరై పోతుంది.  (మిగతా సగం 70 టిఎంసీల నీరు) నదుల్లో లభ్యత వుంటుందన్నారు.  ఇది  నేను కాని బీఆర్ఎస్ పార్టీ కాని చెప్పటం లేదు. మన కేంద్ర  సిడబ్ల్యూసీ చెప్పిన విషయం అన్నారు. 20వేల టీఎంసీల నీరు మాత్రమే ఉపయోగించుకుంటున్నాము. 50వేల టీఎంసీల నీరు సముద్రం పాలు చేసుకుంటున్నాము. 

దేశంలోని ప్రజలంతా తెలంగాణ మాడల్‌ కావాలి

కరువుతో అల్లాడిన తెలంగాణ నేడు దేశంలో అత్యధిక ధాన్యం పండిస్తున్నది. తెలంగాణలో సాధ్యమైంది మహరాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు అని అడిగారు.  దశాబ్దాల కాలం పాటు పాలించిన కాంగ్రెస్ దేశానికి  ఏమి చేసింది?  చిన్న దేశాలైన సింగపూర్, మలేషియా అభివృద్ది చెందయి,  మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. మహారాష్ట్రలో వారానికోసారి తాగు నీరు వస్తుంది ఎందుకు? పుష్కలంగా నీరు ఉన్నా వాడుకోలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. దేశం మొత్తం ఒక మార్పు తేవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ఆవిర్భవించింది. దేశంలో రైతులు ఎప్పుడూ పోరాటం చేయాల్సిన దుస్థితి ఎందుకు? అని ప్రశ్నించారు.  మహరాష్ట్ర తెలంగాణ మధ్య ఒక ప్రత్యేక అనుబంధం ఒకసారి అడుగు ముందుకు వేస్తే వెనకడుగు వేసేది లేదు. దేశంలో లక్ష 40 వేల టీఎంసీల వర్షం పడుతుంది. కానీ దేశంలో తాగునీటికి జనం గోస పడుతున్నారు,  సహ్యాద్రి పర్వతాలు వున్నాయి. పశ్చిమ కనుమల్లో చాలా వర్షం కురుస్తుందన్నారు. జింబాబ్వే 510 టిఎంసీల డ్యాం వుంది. చైనా, ఈజిప్టు, అమెరికా వంటి పలు దేశాలు పెద్ద ఎత్తున నీటిని నిలువ చేసేందుకు డ్యాములను నిర్మిస్తున్నారు. మన దేశంలో మాత్రమే లేదు,  మనదగ్గర ఎక్కువ మొత్తంలో నీటి లభ్యత వున్నా చాలా చోట్ల కరువును చూస్తున్నాము.తాగడానికి నీటికి కటకట ఎదర్కోంటున్నాము. ఇంత పెద్ద దేశంలో నాలుగైదు భారీ ప్రాజెక్టులు ఎందుకు కట్టకూడదని ప్రశ్నలేవనెత్తారు. ప్రస్తుతం దేశంలోని ప్రజలంతా తెలంగాణ మాడల్‌ కావాలని కోరుకుంటున్నారు, మన నాయకులకు ఎందుకు చేయలేకపోతున్నారని అడిగారు.

ఓట్ల కోసమే పనిచేస్తున్నారు…  కానీ దేశాన్ని అభివృద్దిలోకి తీసుకురావడం లేదు

కాంగ్రేస్ సర్కార్ 50 సంవత్సరాలు పరిపాలిచింది. కానీ అభివృద్ది శూన్యం. బీజేపీ సర్కార్ 16 సంవత్సరాల నుండి పరిపాలిస్తున్నది.  కానీ తాగునీటికి, సాగునీటికి ఎన్నో ఇబ్బందులు ఎదర్కొంటున్నాము. తెలంగాణ ఏర్పడిన తరువాత అనేక పరిష్కరించాము. దేశంలో మార్పు తీసుకురావడానికి మహారాష్ట్ర నాంది కావాలన్నారు. ఓట్ల కోసమే పనిచేస్తున్నారు…  కానీ దేశాన్ని అభివృద్దిలోకి తీసుకురావడం లేదు. పంజాబ్ ను మూడు కోట్ల ధాన్యం ఉత్పతి చేస్తున్నది, పూర్తిగా ప్రభుత్వమే ధాన్యాన్నీ కొంటోంది.  రెండు గ్రామాలకు కలిపి ఒక్కటి,  రైతులు సంపూర్ణ విశ్వాసంతో వున్నారు.  పూర్తి సంతృప్తి కరంగా జీవిస్తున్నారన్నారు.  రైతుల బ్యాంకు అకౌంట్లలోకీ నేరుగా వెళుతున్నాయి. ఎటువంటి మధ్యవర్తిత్వం లేదు. రైతులక భీమా చేసినము. ఎల్ఐసి భీమా చేసినం. రైతు రాజ్యం తీసుకురావాలి.. రైతు రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అన్నారు.  దళితబందు కింద 10 లక్షల రూపాయలు తిరిగి మళ్లి చెల్లించకుండా దళితులకు ఇస్తున్నాము. 50వేల కుటుంబాలకు లబ్ది చేకూర్చినామని చెప్పారు.