నాందేడ్: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నాందేడ్ పర్యటనకై శుక్రవారం ప్రగతి భవన్ నుంచి ఉదయం 11.40 గంటలకు బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి ప్రత్యేక విమానంలో నాందేడ్ బయలుదేరి వెళ్లారు. నాందేడ్ పట్టణానికి చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడి నుండి శిక్షణా శిభిరం ఏర్పాటు చేసిన అనంత్ లాన్స్ కు వేదిక వద్దకు చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ శిక్షణ శిబిరాన్ని సీఎం కేసీఆర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.అనంతరం ఆయన బీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. నాందేడ్ వ్యాప్తంగా కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు వెలిశాయి. శిక్షణ శిబిరం నిర్వహించే అనంత్‌లాన్స్ వేదిక మొత్తం గులాబీ మయమైంది. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు శిక్షణా శిబిరాలకు తరలివచ్చారు. మహరాష్ట్రలో బీఆర్ఎస్ లో చేరిన ఇతర పార్టీల ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగిస్తూ..
రెండు రోజుల శిక్షణ అనంతరం నియోజకవర్గాలవారీగా పార్టీ ప్రచార సామగ్రి.. కరపత్రాలు, గులాబీ కండువాలు, టోపీలు, వాల్‌పోస్టర్లను ప్రచార సామగ్రితోపాటు ల్యాప్‌ట్యాప్, ట్యాబ్ పార్టీ బాధ్యులకు అందజేస్తారు. వాటితోపాటు నెలరోజులపాటు చేపట్టనున్న పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన పుస్తకాలను కూడా నియోజకవర్గాలవారీగా పంపిణీ చేస్తారు. మహారాష్ట్ర స్థానిక కళా సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన పాటలు, వివిధ కళారూపాలకు సంబంధించిన సాంస్కృతిక బాండాగారాన్ని సైతం పెన్‌డ్రైవ్‌ల రూపంలో అందజేయస్తారు. శిక్షణ శిబిరం ద్వారా పలువురు ఇతర పార్టీల ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌లో చేరారు. కడదాకా నిలబడి పోరాడే సత్తా ఉన్నవాళ్లు మాత్రమే బీఆర్‌ఎస్ పార్టీలో చేరాలి పార్టీలో చేరేవాళ్లకు ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడే తెగువ ఉండాలి. నిత్యం ప్రజలతో మమేకమై వారిని చైతన్యపర్చాలని సూచించారు. ఒకసారి అడుగు ముందుకు వేస్తే వెనుకడుగు వేసేది లేదన్నారు. మన లక్ష్యం గొప్పదని, త్వరలోనే పార్టీ కమిటీలు నియమించుకుందామని అన్నారు. అదేవిధంగా శిబిరంలో జరిగే శిక్షణ తరగతుల సమాచారాన్ని డిజిటల్ రూపంలో అందిస్తామని, అందరూ వాటిని సమగ్రంగా తెలుసుకోవాలని సీఎం కోరారు.