mt_logo

సీఎం కేసీఆర్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటన వివరాలు

శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి ముఖ్యమంత్రి  చేరుకుంటారు. అక్కడ  గోండు వీరుడు, సాయుధ తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీం విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. వారికి ఘన నివాళులర్పిస్తారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత జిల్లా కేంద్రంలో కొట్నాక్‌ భీం రావ్‌ విగ్రహావిష్కరణ చేస్తారు. వారికి పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం జిల్లా  ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత.. ప్రారంభానికి సిద్ధంగా వున్న సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాల సముదాయానికి చేరుకొని  సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం లబ్ధిదారులకు పోడుపట్టాలను అందజేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం  బహిరంగ సభలో పాల్గొని సీఎం ప్రసంగిస్తారు. దాంతో సీఎం కేసీఆర్  జిల్లా పర్యటన ముగుస్తుంది.