mt_logo

రేవంత్ సోనియాను ఇంతకుముందు బలిదేవత అన్నాడు.. ఇప్పుడు దేవత అంటున్నాడు: హరీష్ రావు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజికవర్గంలో ఈ నెల 30న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో కార్యకర్తల సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.. సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు.గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళ నాన్న చనిపోతే  అంత్యక్రియలు చేశాక స్నానం చేయడానికి కరెంట్ లేదని అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. 

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి డీఎన్ఏలు మ్యాచ్ కావట్లే

ఆనాడు సోనియా గాంధీని బలి దేవత అన్నాడు, ఇటలీ బొమ్మ అన్నాడు నోటికి ఏదొస్తే అదే తిట్టిండని అన్నారు. ఇప్పుడు సోనియాగాంధీ దేవత అంటున్నాడు..రేవంత్ నోటికి మొక్కాలని అన్నారు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకం రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ వచ్చి నేను బీజేపీతో పోరాడుతా బీజేపీపై పోరాడే డీఎన్ఏ నాది అన్నారు. మరి రేవంత్ రెడ్డి డీఎన్ఏ ఏదో రాహుల్ తెలుసుకోవాలన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి డిఎన్ఏ లు మ్యాచ్ కావట్లేదని ఎద్దేవా చేశారు. 

కేసీఆర్‌కి పనితనం తప్ప పగతనం లేదు

మేం ఎవ్వరికీ బీ టీం కాదు మేం తెలంగాణ ప్రజల టీం అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ  ప్పటికి ఒకటి కాదు, నీళ్ల, నూనె ఎప్పుడైనా కలుస్తాయా? ఇది కూడా అంతే అన్నారు. కేసీఆర్‌కి పనితనం తప్ప పగతనం లేదని స్పష్టం చేసారు. కేసీఆర్ తలుచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైల్లో వేయకపోవునా..?,  పక్క రాష్టాల్లో చూస్తున్నాం వాళ్ళు గెలవగానే వీళ్ళను జైలుకు పంపిస్తారు,  వీళ్ళు గెలవగానే వాళ్ళని జైలుకి పంపిస్తారని పేర్కొన్నారు.