mt_logo

ప్రమాదానికి గురైన మరో వందే భారత్ రైలు

గుజరాత్‌లోని వల్సాద్‌ సమీపంలో వందే భారత్ రైలు మరోసారి ప్రమాదానికి గురైంది. వల్సాద్‌కు సమీపంలో వందేభారత్ రైలును ఆవు ఢీకొట్టిందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో రైలు ముందు భాగం పూర్తిగా దెబ్బతినగా కాగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. దాదాపు 30 నిమిషాల పాటు ఆ రైలు అక్కడే నిలిచిపోగా.. విషయం తెలుసుకున్న రైల్వే శాఖ అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుకొని మరమ్మత్తులు చేపట్టారు. అనంతరం ఆ రైలు  అక్కడ్నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం.

కాగా గాంధీనగర్- ముంబై మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సైతం గతంలో రెండుసార్లు ప్రమాదానికి గురైంది. ఈ రెండు ప్రమాదాల్లో రైలు ముందు భాగం దెబ్బతింది. మొదటి ఘటన అక్టోబర్ 6 న జరిగింది, గుజరాత్ నుండి ముంబైకి వేగంగా వెళుతున్న రైలు  ఒక్కసారిగా 4 గేదెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ఆ తర్వాత రెండో ప్రమాదం మరుసటి రోజు అంటే అక్టోబర్ 7న జరిగింది. ఆ సమయంలో కూడా అకస్మాత్తుగా ట్రాక్‌పైకి ఓ ఆవు వచ్చింది. ఈ రెండు ప్రమాదాల్లో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈసారి కూడా రైలు ముందు భాగం దెబ్బతిన్నది. అయితే పశువులు గుద్దితేనే రైలు డ్యామేజీ అవడాన్ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *