mt_logo

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు నిందితుల రిమాండుకు అనుమతించిన హైకోర్ట్

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో నిందితుల రిమాండుకు అనుమతినిస్తూ తెలంగాణ పోలీసులకు హైకోర్టు ఊరటనిచ్చింది. నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన ముగ్గురు ప్రధాన నిందితులను హైదరాబాద్‌ విడిచి వెళ్లొద్దని నిన్న ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు… విచారణను నేటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా నేడు ఉదయం కోర్టు సెషన్ మొదలవగానే విచారణ చేపట్టి, నిందితులను పోలీస్ రిమాండ్ కు అనుమతించింది. ఈ కుట్రలో ప్రధాన నిందితులైన రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, కోరె నందకుమార్ అలియాస్ నందు, సింహయాజిలను తక్షణమే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. అరెస్ట్ చేసిన అనంతరం వారిని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టులో హాజరు పరచాలని పోలీసులకు తెలిపింది. అంతకముందు నిందితులను రిమాండ్ కు ఇవ్వడాన్ని సీబీఐ కోర్ట్ తోసిపుచ్చగా… తెలంగాణ పోలీసుల హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *