mt_logo

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నాడు 17 ప్రశ్నలు.. నేడు వ్యతిరేక ఫ్లెక్సీలు

తెలంగాణ పర్యటనలో భాగంగా ఓరుగల్లుకు విచ్చేయుచున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి  వ్యతిరేకంగా వరంగల్ నగరంలో  నిరసన వ్యక్తమవుతోంది. ప్రధాని రాకకు వ్యతిరేకంగా నగరవ్యాప్తంగా  ఫ్లెక్సీలు, పోస్టర్లు భారీగా వెలిశాయి. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ‘నేను వరంగల్‌-నాది తెలంగాణ’ అనే పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

-మామునూరు ఎయిర్‌పోర్టు ఏమైంది?

-గిరిజన విశ్వవిద్యాలయం ఏది?

-బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏమైంది?

-రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏది? 

– ఐటీఐఆర్‌ ఏమయ్యాయి అంటూ..  ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో పర్యటించే ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

నాడు ప్రధానికి 17 ప్రశ్నలతో వ్యతిరేక ఫ్లెక్సీలు 

ప్రధాని మోదీ తెలంగాణకు గతంలో (26-5-2022) వచ్చారు ఆ నాడు నగర యువత “ప్రశ్న” లు విసిరారు.  తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్షను తెలుపుతూ.. ప్రశ్నించారు. 17 ప్రశ్నలతో 17 చోట్ల బ్యానర్లు కట్టి వెల్కమ్ చెపుతూనే.. సమాధానం కోరారు. 

17 ప్రశ్నలు ఇవే : 

1. తెలంగాణకు కొత్తగా నవోదయ విద్యాలయాలను ఎందుకు మంజూరు చేయడం లేదు?. 

2. గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ను గుజరాత్ కు ఎందుకు తరలించారు?

3. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏది? 

4. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ? 

5. రాష్ట్రానికి డిఫెన్స్ కారిడార్ ఎందుకు మంజూరు చేయలేదు?

6. కేంద్రం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఎందుకు మంజూరు చేయలేదు?

7. తెలంగాణలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ అఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎక్కడ ఉంది?. ఎందుకు మంజూరు చేయలేదు?

8. ఐటీఐఆర్ ఎక్కడ?

9. ఫార్మాసిటీకి ఆర్థిక సాయం ఏమైనా చేశారా?

10. తెలంగాణకు ఐఐఎం ఎక్కడ?

11. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు?

12. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎక్కడ?

13. నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ మిషన్ భగీరథకు నిధులు ఎందుకు ఇవ్వలేదు?  

14.  హైదరాబాద్ కు వరద సాయం ఎందుకు చేయలేదు?

15. నిజామాబాద్ లో పసుపు బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదు?

16. తెలంగాణాకు మెగా పవర్ లూమ్ టెక్స్ టైల్ క్లస్టర్ ఒక్కటి కూడా ఎందుకు మంజూరు చేయలేదు ? 

17. కేంద్రం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఎందుకు మంజూరు చేయలేదు?