- గాంధీ లో ఒక వారంలో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ ఆసుపత్రి
- రాష్ట్రంలో పనిచేస్తున్న 27 వేల మంది ఆశా వర్కర్లకు శుభవార్త
జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు నియమితులైన 1560 మంది ఆశా కార్యకర్తలకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, వైద్య అధికారులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలి. వ్యాధితో బాధపడుతున్న వారికి వైద్యుడు, సిబ్బంది ని దేవుడిగా భావిస్తారు. పేదలకు ఉత్తమ సేవలు అందించడంలో కలిసికట్టుగా పనిచేద్దాం అన్నారు. పిల్లల కు 100% వ్యాక్సిన్ వేసిన రాష్ట్రం తెలంగాణ, 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీ లు సాధించాం. వైద్య ఆరోగ్యంలో 14 వ స్థానం నుంచి రాష్ట్రం ఏర్పడిన తరువాత 3వ స్థానంలోకి వచ్చామన్నారు.
బీఆర్ఎస్ పార్టీది న్యూట్రిషన్ పాలిటిక్స్
తెలంగాణ కు ముందు ప్రైవేట్ లో 70%, 30% ప్రభుత్వ ఆసుపత్రులో డెలివరీలు జరిగేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో 70% డెలివరీలు అవుతున్నాయని గుర్తు చేసారు. మనది న్యూట్రిషన్ పాలిటిక్స్ అయితే కొందరివి పార్టీషన్ పాలిటిక్స్. కుల మతాల చిచ్చు పెట్టే పార్టీషన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు ఆశా వర్కర్లు చెప్పాలి. టీ డియాగ్నోస్టిక్స్ ద్వారా ప్రజలకు ఉచిత చికిత్సలు. ఒక్కో ఆశ వర్కర్ పై 50వేలు ఖర్చుపెట్టి శిక్షణ ఇచ్చి… ఆరోగ్య కార్యకర్తలుగా తీర్చిదిద్దుతాం అన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న 27 వేల మంది ఆశ వర్కర్లకు శుభవార్త. ఈ నెల నుంచి ఆశాలకు ఇచ్చిన సెల్ ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. దేశంలో అత్యధిక వేతనం ఆశాలకు తెలంగాణలోనే ఇస్తున్నామని చెప్పారు.
ప్రధాని మోదీ రాష్ట్రం లో ఆశాలకు వేతనం 4500 జీతం మాత్రమే
నాలుకకు నరం లేదని ప్రతిపక్షంలోని వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆశాలకు గతంలో వేతనం.పెంచమని అడిగితే గుర్రాలతో తొక్కించారు. అర్ధరాత్రి ఆశా వర్కర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచిన చరిత్ర కాంగ్రెస్ ది. 4500 జీతం మాత్రమే ప్రధాని మోదీ రాష్ట్రం గుజరాత్ లో ఆశాలకు వేతనం ఇస్తున్నారు.
కాంగ్రెస్ బస్తీ ప్రజల సుస్థి గురించి ఆలోచించలేదు
కాంగ్రెస్ వలు నోటికి వచ్చినట్టు మాట్లాడతారన్నారు. సెకండ్ ఏఎన్ఎం లను కావాలనే రెచ్చగొడుతున్నారు .సెకండ్ ఏఎన్ఎం లకు రాష్ట్రంలో 27000 లకు పైగా వేతనం. కాంగ్రెస్ ,భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇంత వేతనం లేదు. ఏఎన్ఎం ల రిక్రూట్మెంట్ లో మీకే మొదట ప్రాధాన్యత ఇస్తాం అన్నారు. కాంగ్రెస్, తెలుగు దేశం బస్తీ ప్రజల సుస్థి గురించి ఆలోచించలేదు. బస్తీ దవాఖాన సూపర్ హిట్ అయింది. బస్తీ దవాఖాన ల వల్ల ఉస్మానియాలో 60% ఓపీ భారం తగ్గిందన్నారు. గాంధీ హాస్పిటల్ లో 56% ఓపీ తగ్గింది, ఫీవర్ ఆసుపత్రిలో 72% ఓపీ భారం తగ్గింది. గర్భిణుల కోసం 3 కొత్త ఆసుపత్రులు, గాంధీ లో ఒక వారంలో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ ఆసుపత్రి ప్రారంభిస్తామని తెలిపారు.