mt_logo

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 105 సీట్లు బీఆర్ఎస్ కే : సీఎం కేసీఆర్ 

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్ష, పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభించారు. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ కార్పోరేషన్‌ల ఛైర్మన్‌లు హాజరయ్యారు ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. చేసింది చెప్పుకుంటే చాలు.. పదేళ్లలో ఏం చేశామో జనాలకు చెప్పండి, రైతులను చెరువుల దగ్గర కు పిలిచి మీటింగ్ పెట్టండి న్నారు. చెరువు గట్ల మీద రైతుల తో కలిసి భోజనం చేయండి, 70 ఏండ్లలో కాంగ్రెస్ చేసింది ఏమి లేదు..వాళ్ళను ప్రజలు నమ్మరు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 105 సీట్లు బీఆర్ఎస్   కు వస్తాయన్నారు. మంత్రులు ఆయా జిల్లాలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పర్యవేక్షించాలన్నారు.