సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇలా మాట్లాడారు.హుస్నాబాద్ వస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపించింది. ఆ నాడు నెర్రెలు పారిన నెలలు, నెత్తురు కారిన ప్రాతం, కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన తీసుకున్న రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల చూడ సక్కగా అయినాయి అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఊర్లో కరెంటు ఉంటే వార్త ఇప్పుడు కరెంటు పోతే వార్త అని అన్నారు.దేవుడా దేవుడా అంటూ మోడీ భజన చేసే బండి సంజయ్ ప్రజలకు చేసిన మేలు ఏందీ? రైతుల ఆదాయం డబుల్ అన్నారు ఏది? ఎక్కడ ఆదాయం అన్నారు. శవం ఎల్తే మీది శివం ఎల్తే మాది అంటారు. మసీదులు తవ్వేతందుకు మీరు అవసరమా మాకు అని మండిపడ్డారు.
బీఆర్ఎస్ అంటే రాష్ట్ర రైతుల పార్టీ అన్నారు. నేను వస్తున్న దారిలో ఆగి గిరిజన తాండ ఆడబిడ్డల్నికలిసి నీరు వస్తుందా అమ్మ అని నేను అడుగుతే అన్నా బంజారాహిల్స్ లో ఎట్లా వస్తున్నాయో అట్లనే ఇక్కడ కూడా వస్తున్నాయ్ అన్నారు. అంతే కాదు తెలంగాణ రాకముందు ఎమ్మెల్యే, ఎంపీటీసీ లు ఊరికి రావాలంటే భయపడే వాళ్ళు మేము ఎక్కడ బిందెలు అడ్డం పెడతామో అని, అటు నుండి అటే పోయి వాళ్ళు.. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కాలర్ ఎగరేసి మా కౌన్సిలర్లు, సర్పంచులు తిరుగగలుగుతున్నారంటే, ఒక్క కేసీఆర్ వల్లనే అని అన్నారు.