mt_logo

మ‌హిళ‌ల‌కు ఉచిత కుట్టు శిక్ష‌ణ‌ ఉద్యోగావ‌కాశాలు : మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అవుతాపురంలో కుట్టు శిక్ష‌ణ కేంద్రాన్ని ప్రారంభించారు.  దేశానికే ఆద‌ర్శంగా మ‌హిళ‌ల‌కు ఉచిత కుట్టు శిక్ష‌ణ‌, ఉపాది, ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించే కార్య‌క్ర‌మాన్ని పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచే ప్రారంభించ‌కున్నాం. పైల‌ట్ ప్రాజెక్టుగా విజ‌య‌వంతంగా పాలకుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోనే మొద‌లు పెట్టాం. రూ.5 కోట్ల‌తో 10వేల మందికి శిక్ష‌ణ ఇవ్వ‌డం ల‌క్ష్యం. మొద‌టి విడ‌త శిక్ష‌ణ పూర్త‌యింది. రెండో విడ‌త మొద‌లైంది. ఇప్పుడు 3 వేల మందికి శిక్ష‌ణ ఇస్తున్నాం. మిగ‌తా 7 వేల మందికి కూడా శిక్ష‌ణ ఇస్తాం, ఉచితంగా కుట్టు మిష‌న్ల‌ను పంపిణీ చేస్తున్నాం. ఆ త‌ర్వాత ఈ ప‌థ‌కాన్ని రాష్ట్ర వ్యాప్తం చేస్తామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి వివ‌రించారు. 

పెద్ద వంగ‌ర మండ‌లంలో మంత్రి గురువారం సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశారు. పోచంప‌ల్లిలో శ్రీ‌రామ‌చంద్ర‌స్వామి గుడి శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా పూజ‌లు చేశారు. అనంత‌రం గ్రామ‌స్థుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. బిసి తండాలో మక్క‌జొన్న కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు. అవుతాపురంలో కుట్టు శిక్ష‌ణ కేంద్రం రెండ విడ‌త శిక్ష‌ణ‌ను ప్రారంభించారు. ఆయా చోట్ల మంత్రి వేర్వేరుగా మాట్లాడారు. సిఎం కెసిఆర్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ‌లో జ‌రుగుతున్న ప‌లు అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు, ప‌నుల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. అన‌తి కాలంలోనే తెలంగాణ దేశంలో నెంబ‌ర్ వ‌న్ గా నిల‌వ‌డ‌మే గాక‌, అన్ని రంగాల్లో తెలంగాణ అగ్ర‌గామిగా ఉంద‌ని తెలిపారు.