mt_logo

మోడీ క్షేమాపణ చెప్పాలి : ఢిల్లీ మంత్రి ఆతిషి

హైదరాబాద్‌: ఢిల్లీ మద్యం విధానం కేసులో నేరం జరిగినట్లు ఎటువంటి ఆధారం లేదని సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయంపై ఆప్‌ ముఖ్యనేత, ఢిల్లీ మంత్రి ఆతిషి..  మద్యం కుంభకోణం ఓ పెద్ద అబద్దమని అన్నారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని స్వయంగా కోర్టే తెలిపిందని అన్నారు.  ఈడీ, సీబీఐ చార్జిషీట్‌లోని స్క్రిప్ట్‌ పీఎంవో నుంచే  స్క్రిప్ట్‌  రాస్తున్నారని, పైగా ఈ  స్క్రిప్ట్‌ పైన ఆధారాలను చూపించాలని అధికారులపై ఒత్తిడి పెడుతున్నారని  ఆమె అన్నారు.  లంచం, కిక్‌బ్యాక్‌ చెల్లింపులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు తేల్చి చెప్పిందని తెలిపారు.  ఈ మేరకు మీడియాతో మాట్లాడిన మంత్రి. .  సాక్షులు చెప్పిన దాని ప్రకారం చెల్లింపులు జరిగినట్టు పరిగణించలేమంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాల చదివి వినిపించారు. తొలుత రూ.100 కోట్ల స్కామ్‌ అని ఆరోపించిన అధికారులు.. తర్వాత మాటమార్చి రూ.30 కోట్లు అంటున్నారని  ఆతిషీ అన్నారు. ఆ మొత్తానికి కూడా వారు ఆధారాలు చూపలేకపోయారని అన్నారు.ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు ప్రెస్‌మీట్‌ పెట్టి క్షమాపణ కోరాలంటూమంత్రి డిమాండ్‌ చేశారు.కుంభకోణాన్ని ఉందని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. దీనిపై దేశ ప్రజలకు ప్రధాని, బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.