mt_logo

దేవుడు నన్ను తెలంగాణ కు పంపడం గొప్ప అదృష్టం: గవర్నర్ తమిళిసై

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నర్ తమిలి సై తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.   తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్ అభివృద్ధి మాత్రమే కాదు, కొంత మంది అభివృద్ధి కాకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అయితేనే సంపూర్ణ అభివృద్ధి అనిపించుకుంటుందన్నారు. వచ్చే సంవత్సరం నాటికి దేశంలో తెలంగాణ నంబర్1 కావాలని కోరుకున్నారు. జై తెలంగాణ అంటే స్లోగన్ ఒక్కటే కాదు.. ఆత్మ గౌరవ నినాదమన్నారు. అమరవీరులందరికీ నా జోహార్లు,  నా జీవితంలో ప్రతి నిమిషం ప్రజల కోసమేనన్నారు. దేవుడు నన్ను తెలంగాణ కు పంపడం గొప్ప అదృష్టమన్నారు. నేను మీతో ఉన్నాను. మీరు నాతో ఉన్నారన్నారు.