Mission Telangana

క్రైస్తవ సమాజాన్ని గతంలో ఓటు బ్యాంకుగానే చూసేవారు: మంత్రి హరీశ్ రావు

ఎల్బి స్టేడియంలో నిర్వహించిన క్రైస్తవ మతస్తుల ప్రార్థనా సమావేశాల్లో ఎమ్మెల్సీ రాజేశ్వర రావుతో కలిసి పాల్గొన్న మంత్రి హరీశ్ రావు…
సీఎం కేసీఆర్ గారు కులం, మతం తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తున్నారు. అన్ని వర్గాలు బాగుంటేనే దేశం బాగుంటుంది అని సీఎం కేసీఆర్ గారు నమ్మి పని చేస్తున్నారు. రంజాన్, క్రిస్టమస్, దసరా పండగ ఏదైనా రాష్ట్రంలో అందరం కలిసి సంబురాలు చేసుకుంటారు.హైదరాబాద్ లో ఉప్పల్ భగాయత్ లో ఆత్మ గౌరవ భవనం కోసం స్థలం కేటాయించారు. క్రైస్తవ సమాజాన్ని గతంలో ఓటు బ్యాంకుగా చూసేవారు, కానీ సీఎం కేసీఆర్ గారు సమాజ సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారు. క్రిస్ మస్ సెలవులు ప్రకటించారు. అధికారంగా పండుగ నిర్వహిస్తున్నారు. సమాధుల స్థలానికి మంచి స్థలం ఇస్తామని చెప్పారు. అనేక జిల్లాల్లో ఇచ్చాము. ఏవైనా సమస్యలు ఉంటే, మా దృష్టికి తీసుకు రావాలని కోరుతున్నా. సీఎం కేసీఆర్ గారు 9 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. కులం మతం కొట్లాటలు లేవు. ప్రశాంతంగా అందరం కలిసి ఉంటున్నము. పేదలే మా మతం అని సంకల్పించి అనేక పథకాలు అమలు చేస్తున్నారు. విదేశాల్లో పేద పిల్లల చదువు కోసం 20 లక్షలు ఇస్తున్నది. తెలంగాణ అబివృద్దికి అన్ని మతాల ఆశీస్సులు ఉండాలి. సీఎం కేసీఆర్ గారి కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరు ప్రార్థనలు చేయాలి అని కోరుతున్నాను అన్నారు.