mt_logo

ఒక సగటు సమైక్యవాది మనోగతం

By: విశ్వరూప్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎందుకు వ్యతిరేకమో ఒక సగటు సమైక్యవాదికి గల కారణాలు:

1) హైదరాబాదు లో నేను ఇళ్ల స్థలాలూ, ఫ్లాట్సూ కొనుక్కున్నాను. ఇప్పుడు విడిపోతే నా ప్రాపర్టీ ధరలు పడిపోతే? వామ్మో వాయ్యో… (అంతా నా స్వార్ధమే… సామాన్య జనం ఎటుపోతే నాకేం).

2) ఇప్పటిదాకా మాకు తేరగా క్రిష్ణా జలాలు వస్తున్నాయి మాకు న్యాయమయిన వాటాలేకపోయినా. ఇప్పుడు మీ రాష్ట్రం ఏర్పడితే మరి రాష్ట్రాల మధ్య నీళ్ల్ వాటా బోర్డు నిర్ణయిస్తుంది కదా. అప్పుడు ఇప్పటిలాగా మాకు తేరగా నీళ్లు రావు కదా ఎలా, అమ్మో? (ఇప్పుడు మాకు దక్కాల్సినదానికంటే ఎక్కువ దక్కుతుందనేది నిజమేననుకోండి).

3) ఇప్పుడంటే అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో అన్నిచోట్ల పై అధికారులు మావారే కాబట్టి మావాళ్లు మెల్లగ దొడ్డిదారిలో దూరిపోతారు. లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఎలాగూ ఉంది మావారికి ఉద్యోగాలు ఇప్పించడానికి. ఇవన్నీ కాకపోతే దొంగ సర్టిఫికెట్ పెట్టి తెలంగాణ కోటాలో ఉద్యోగం తెచ్చుకోవచ్చు.

రేపు రాష్ట్రం ఏర్పడితే మాప్రాంతంలోని ఉద్యోగాల్లోనే మాలో మేమే పోటీపడాలికదా, ఎలా మరి?

4) ఇప్పుడంటే తెలంగాణ మాతో ఉంది కాబట్టి అందరం కలిసి ఇక్కడ తినేస్తాం కానీ రేపు విడిపోతే మాలో మేమే (సీమ, ఆంధ్రా వాళ్లం) మీరు దోచుకుంటున్నారంటే మీరని కొట్టుకుంటాం, అలా మేం కొట్టుకోవడం అవసరమా?

5) ఇప్పుడంటే తెలంగాణాకు చెందాల్సిన నిధులన్నీ మాకు వచ్చేస్తున్నాయి, విడిపోతే మాప్రాంతంలోని ఆదాయంపై మాత్రమే మేము ఆధారపడాలి, అలా అయితే ఎలా?

6) ఇప్పుడంటే సమైక్య రాష్ట్రంలో మా కులం వాళ్లు బలమయిన స్థానంలో ఉన్నారు. అధికారం మా కులానికి లేక ఫలానా కులం వారికే ఎప్పుడూ దక్కుతుంది. రేపు రాష్ట్రాలు విడిపోయి చిన్న రాష్ట్రం అయితే బడుగు వర్గాలు మమ్మల్ని వెనక్కి నెట్టేసి అధికారం చేజిక్కించుకుంటే, అమ్మో ఎలా?

7) మాకు సొంత గుండెకాయ లేదే? ఇంతకుముందు మద్రాసే మా గుండె అనుకున్నాం. అది అందకపొయ్యేసరికి హైదరాబాదే మా గుండె అని ఇప్పుడనుకుంటున్నాం. ఇప్పుడు విడిపోతే మా గుండెకాయ వెతుక్కోవాలి, ఎక్కడుందో ఏమో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *