సీఎం కేసీఆర్ చేపట్టిన టీఎస్-ఐపాస్ ను మెచ్చుకుంటూ పశ్చిమబెంగాల్ చీఫ్ జస్టిస్ మంజులా చెల్లూర్ ప్రశంసల వర్షం కురిపించారు. పెట్టుబడులు రావాలంటే సీఎం కేసీఆర్ తరహాలో ఉండాలని, పారిశ్రామికవేత్తలను తెలంగాణ ప్రభుత్వం రెడ్ కార్పెట్ తో స్వాగతిస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నారని, సరైన పాలసీ లేకుంటే బెంగాల్ లో ఎవరు పెట్టుబడులు పెడతారని ఆమె అన్నారు. హెడ్ క్వార్టర్ అయినప్పటికీ బెంగాల్ కు ఐటీసీ రూ. 3 వేల కోట్లు మాత్రమే ప్రకటించింది. టీఎస్-ఐపాస్ ఆవిష్కరణ సమావేశంలో ఐటీసీ కంపెనీ తెలంగాణకు రూ. 8 వేల కోట్ల పెట్టుబడులు ప్రకటించిన విషయం తెలిసిందే.