వరంగల్ లోక్ సభ ఉపఎన్నిక ఫలితంపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారం సమయంలో ప్రతిపక్షాలు చేసిన చిల్లర ప్రచారాలను వరంగల్ ప్రజలు తిప్పికొట్టారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారు ఆశీర్వదించారని అన్నారు. తెలంగాణ వాయిస్ ను వినిపించడానికి మరో సభ్యుడు వచ్చాడని హరీష్ రావు పేర్కొన్నారు.