వరంగల్ లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4,59,092 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. గతంలో సీఎం కేసీఆర్, డిప్యూటీ కడియం శ్రీహరి రికార్డులను దయాకర్ తిరగరాశారు. ఇదిలాఉండగా కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి. తొలి రౌండ్ నుండి చివరి రౌండ్ వరకు ప్రతిసారీ అన్ని సెగ్మెంట్లలో టీఆర్ఎస్ పార్టీనే అత్యధిక మెజారిటీ దిశగా దూసుకెళ్లింది. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. టీఆర్ఎస్ గెలుపుతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పటాకులు పేల్చుకుని, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.