తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజారోగ్య సంరక్షణ.. విద్యాభివృద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య విద్యా రంగంలో అనేక విప్లవాత్మకమైన పలు కార్యక్రమాలను అమలు చేస్తూ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో రాష్ట్రాన్ని నిలబెట్టింది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యలతో తెలంగాణ రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’ గా అవతరించింది. తెలంగాణ రాష్ట్ర వైద్య రంగ ప్రగతి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా స్ఫూర్తిదాయకంగా నిలిచింది. శిశువులు, మహిళలు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మొదలైన వారి అవసరాలకు అనుగుణంగా వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు సమర్థవంతమైన కార్యాచరణను అమలు చేస్తూ పురోగమిస్తుంది.
వరంగల్ నగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖాన. ఈ దవాఖానను 2000 కు పైగా పడకల సామర్ధ్యంతో అత్యంత అధునాతన వసతులతో నిర్మిస్తున్నారు. ఈ దవాఖానను ఈ ఏడాది దసరా పండుగ రోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నిర్ణయించారు.