mt_logo

ప్రజల అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఓటు వేయండి

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత, క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఓటర్లకు పిలుపునిస్తూ ట్వీట్ చేసారు. ప్రియమైన కర్ణాటక ప్రజలారా.. ద్వేషాన్ని తిరస్కరించండి! సమాజం మరియు ప్రజల అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఓటు వేయండి అని పిలుపునిస్తూ ట్వీట్ చేసారు. క‌ర్ణాట‌క‌లోని 224 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒకే విడుత‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.ఈ సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగ‌నుంది. ఈ ఎన్నిక‌ల్లో 2,615 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. మొత్తం 5,31,33,054 మంది ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును ఈవీఎంల‌లో నిక్షిప్తం చేస్తున్నారు. మే 13న ఓట్ల లెక్కింపు జరుగనున్నట్లు సమాచారం.