mt_logo

తెలంగాణ ప్రభుత్వ మాతాశిశు సంరక్షణ చర్యలపై యునిసెఫ్ ప్రశంసలు 

మాతాశిశు సంరక్షణకు తెలంగాణ ప్రభత్వం తీసుకుంటున్న చర్యలపై యునిసెఫ్ ఇండియా ప్రశంసలు కురిపించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవాల కోసం మిడ్ వైఫరీలకు ఇస్తున్న శిక్షణను అభినందిస్తూ యునిసెఫ్ ఇండియా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. హైదరాబాద్ లోని ఓ ఏరియా ఆసుపత్రిలో మిడ్ వైఫరీ ద్వారా పురుడు పోసుకున్న శిశువు ఫొటోను జత చేస్తూ, ఫర్ ఎవ్రీ చైల్డ్, ఎ హెల్తీ స్టార్ట్ అనే హ్యాష్‌ట్యాగ్‌ అని రాసి మెచ్చుకుంది. 

గర్భిణీలకు సాధారణ ప్రసవాలు – సంరక్షణ అంశంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరు గొప్పగా ఉందని యునిసెఫ్ ఇండియా పేర్కొంది. ప్రసవ సమయంలో తల్లిబిడ్డలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, పాజిటివ్ బర్త్ ఎక్స్‌పీరియ‌న్స్ కలిగేలా మిడ్ వైవ్స్ కు శిక్షణ ఇస్తోందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తోన్న ఈ శిక్షణ అద్భుతంగా ఉందని ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల శాఖ, నర్సింగ్ డైరెక్టర్ జనరల్ రతి బాలచంద్రన్ కొనియాడారు. 

కాగా రాష్ట్ర ప్రభుత్వం ఫెర్నాండెజ్ ఫౌండేషన్ ఆసుపత్రితో పాటు, మరో ఐదు దావఖానాల్లో ఈ శిక్షణను నిర్వహిస్తోంది. గర్భిణులు సాధారణ ప్రసవం జరగడానికి తీసుకోవాల్సిన వ్యాయామం, ఆహారం… సాధారణ ప్రసవం వల్ల లాభాలు మరియు సాధారణ ప్రసవాలు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఎలా చేయాలి అనే విధానంపై శిక్షణ ఇస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *