mt_logo

ఈ లక్ష్యంతోనే యూకే పర్యటనకు బయలుదేరిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ పరిశ్రమలు మరియు ఐటి శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు యూకే పర్యటనకు బయలుదేరారు. ఈరోజు ఉదయం యుకేకు బయలుదేరిన మంత్రి కేటీఆర్ 13వ తేదీ వరకు తన పర్యటనను కొనసాగిస్తారు. మంత్రి కేటీఆర్ తన పర్యటనలో భాగంగా యూకే లోని పారిశ్రామిక దిగ్గజ సంస్థలతోపాటు… వ్యాపార వాణిజ్య సంఘాలతో సమావేశం అయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని వివరిస్తారు.