mt_logo

బీజేపీకి బీ టీం ఎవ‌రో తేలిపోయింది.. పార్ల‌మెంట్‌లో టీపీసీసీ చీఫ్ హేగ్డేవార్ జ‌పం.. ఆందోళ‌న‌లో హ‌స్తం!

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని నియ‌మించ‌డం ఆ పార్టీలో ఎవ‌రికీ ఇష్టం లేదు. ఆయ‌న‌కు ఆ ప‌ద‌వి ఇవ్వ‌డాన్ని జూనియ‌ర్ల నుంచి సీనియ‌ర్ల దాకా అంతా వ్య‌తిరేకించారు. రేవంత్ ప‌ద‌వి చేప‌ట్టినాటినుంచి కాంగ్రెస్‌లో కూటమి రాజ‌కీయం న‌డుస్తున్న‌ది. ఆర్ఎస్సెస్ మూలాలున్న వ్య‌క్తిని పార్టీ అధ్య‌క్షుడిగా ఎలా నియ‌మిస్తారంటూ అంద‌రూ వ్య‌తిరేకించారు. కాంగ్రెస్‌లోనే పుట్టి.. కాంగ్రెస్ పార్టీ కోస‌మే క‌డ‌దాకా ఉన్న సీనియ‌ర్ల‌ను కాద‌ని ఆర్ఎస్సెస్ భావ‌జాలం ఉన్న రేవంత్‌రెడ్డికి ప‌ద‌వి క‌ట్టబెట్ట‌డంపై సాక్షాత్తూ పంజాబ్‌ సీఎం అమరేందర్‌సింగ్ ట్వీట్ చేశారు. పార్టీ ద్వంద్వ నీతిని ఎండ‌గ‌ట్టారు. గాంధీభ‌వ‌న్‌లో గాడ్సే దూరాడంటూ ఆ పార్టీ నేత‌లే వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ వ్యాఖ్య‌లను రేవంత్ నిజం చేసి చూపించాడు. పార్ల‌మెంట్ నిండు స‌భ‌లో ఆరెఎస్సెస్ వ్య‌వ‌స్థాప‌కుడు హెగ్డేవార్ పేరును అసంద‌ర్భంగా ప్ర‌స్తావించి అడ్డంగా బుక్క‌య్యాడు. 

బీజేపీ నేత ఆశీస్సుల కోసం రేవంత్ తండ్లాట‌!

టీపీసీసీ చీఫ్ రేవంత్ బీజేపీ నేత‌ల ఆశీస్సుల కోసం తండ్లాడుతున్నారు. అందుకే పార్ల‌మెంట్‌లో బుధ‌వారం బీజేపీ స‌ర్కారుపై ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడుతూ హెగ్డేవార్ జ‌పం చేశారు. కేశ‌వ్ బ‌లిరాం హెగ్డేవార్ పుట్టింది తెలంగాణ‌లోనే అంటూ అసంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. అస‌లు ఎలాంటి సంబంధం లేకున్నా రేవంత్‌.. హెగ్డేవార్ ప్ర‌స్తావ‌న తీసుకురావ‌డంపై కాంగ్రెస్ నేత‌లు త‌ల‌లు విస్మ‌యానికి గుర‌వుతున్నారు. రేవంత్ వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్య‌ల‌తో బీజేపీకి బీ టీం కాంగ్రెస్ పార్టీనే అని తేలిపోయింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఒక‌వేళ కాంగ్రెస్ పుట్టి మునిగితే.. బీజేపీ ప‌డ‌వ ఎక్కేందుకు రేవంత్ లైన్ క్లియ‌ర్ చేసుకుంటున్నాడ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ కుటిల రాజకీయాలతో బీజేపీకి కోవర్టుగా పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నారా? అని బీఆర్ఎస్ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.