mt_logo

మహారాష్ట్రలో 5 గ్యారంటీల కాంగ్రెస్ గారడీని ప్రజలు నమ్మలేదు: హరీష్ రావు

మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీ ప్రజలు నమ్మలేదు అని స్పష్టం అయ్యింది అని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారు అని అన్నారు.

తెలంగాణలో మహిళలకు రూ. 2,500 ఇస్తామన్న మహాలక్ష్మీ పథకం అమలు చేయకుండా మహారాష్ట్రలో రూ. 3,000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసారా దోఖా, రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకపోవడం వంటివి మహారాష్ట్రలో తీవ్ర ప్రభావం చూపెట్టాయి అని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలోని ముంబయి, షోలాపూర్ , పూణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తుండడం వలన కాంగ్రెస్ మోసాలు విరివిగా మహారాష్ట్రలో ప్రచారం అయ్యాయి అనేది సుస్పష్టం అని అన్నారు.

బీజేపీ హేమంత్ సోరేన్‌పై పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు, పార్టీ చీల్చే ప్రయత్నాలను ఝార్ఖండ్ ప్రజలు తిప్పి కొట్టారు. బీజేపీ కక్ష సాధింపు విధానాలని ప్రజలు హర్శించడం లేదని తేలిపోయింది. విజయం సాధించిన హేమంత్ సోరేన్‌కు శుభాకాంక్షలు అని హరీష్ రావు పేర్కొన్నారు.