mt_logo

4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాల పంపిణి : సీఎం కేసీఆర్

హైదరాబాద్, మే 26: గురువారం డా.బిఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యచరణ, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. జూన్ 24 నుంచి 30 తారీఖు వరకు గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా…2845 గ్రామాలు తాండాలు గూడాల పరిథిలో ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో వున్న 4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాలు అందచేయాలని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ద్వారా 1,50,224మంది  గిరిజనులకు లబ్ధి చేకూరుతుందని సీఎం స్పష్టం చేశారు. పోడుభూముల పట్టాలు అందించిన వెంటనే ప్రతి లబ్ధిదారుని పేరుతో ప్రభుత్వమే ఐఎఫ్ఎస్ కోడ్ తో కూడిన బ్యాంకు ఖాతాను తెరిపించాలని ఈ బాధ్యత గిరిజన సంక్షేమ శాఖ, కలెక్టర్ దేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ఖాతాల ద్వారా లబ్ధిదారులకు రైతుబంధును ప్రభుత్వం అందచేస్తుందని సీఎం తెలిపారు. వీరితో పాటు 3 లక్షల 8 వేల మంది ఆరో వో ఎఫ్ ఆర్ పట్టాదారులకు కూడా రైతుబంధును వర్తింపజేస్తామని సీఎం అన్నారు.