mt_logo

ముఖ్యమంత్రి కప్ పిల్లలకు మానసిక ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తోంది  : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా మే 15 నుండి నిర్వహించనున్న సీఎం కప్ లో భాగంగా మండల స్థాయి పోటీలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి తో కలిసి నిర్మల్ మండలం లోని వెంగ్వాపెట్ గ్రామం లో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆటలు ఆడటం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని, ఒత్తిడి నీ అధిగమించవచ్చు అని, ఈ మండల స్థాయి పోటీలు మే 15 నుంచి 17 వరకు మూడు రోజులు నిర్వహించబడుతున్నాయని  అన్నారు. మండల స్థాయి విజేతలకు 15 వేల రూపాయలు బహుమానం గా అందించ పడుతుందన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  నూతన జిల్లాలు ఏర్పడిన తర్వాత అభివృద్ధి వేగం గా జరుగుతుందని, అందులో భాగంగా ముఖ్యమంత్రి కప్ కూడా పిల్లల మానసిక ఉల్లాసాన్ని , ఆనందాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని, మండల స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు జిల్లా స్థాయి లో ఆడుతారని, జిల్లా స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. మండల స్థాయి లో 15 వేల రూపాయలు బహుమానం, జిల్లా స్థాయి లో 75 వేల రూపాయలు బహుమానం గా ఇవ్వబడుతుంది అని అన్నారు