mt_logo

బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర లో సృష్టించిన ప్రభంజనం సెగలు హస్తినను తాకుతున్నాయి  

  • దేశంలో ప్రధాన పార్టీగా  బీఆర్ఎస్
  • విజన్ ఉన్న నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు గుర్తింపు
  • మహారాష్ట్ర లో బీజేపీ ప్రభంజనం మొదలైంది
  • హస్తినకు ఈ ప్రభంజనం సెగలు తగులుతున్నాయి
  • లోక్సభ ఎన్నికల నాటికి దేశంలో బలీయమైన శక్తిగా బీఆర్ఎస్
  • ఎత్తుగడల భాగమే కర్ణాటక ఎన్నికలకు దూరం
  • బీఆర్ఎస్ పోటీలో లేక పోవడమే కాంగ్రెస్ గెలుపుకు దోహదం

సూర్యాపేట: లోకసభ ఎన్నికల నాటికి దేశంలో బీఆర్ఎస్ పార్టీ బలీయమైన శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. విజన్ ఉన్న నాయకుడిగా దేశ ప్రజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎనలేని ఆదరణ ఉందని ఆయన పేర్కొన్నారు. శనివారం ఉదయం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియా తో మాట్లాడుతూ మహారాష్ట్ర లో బీఆర్ఎస్ నమోదు చేసుకున్న విజయం పై  ఆయన స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర లో సృష్టించిన ప్రభంజనం సెగలు హస్తినను తాకుతున్నాయాన్నారు. ఎత్తుగడలో భాగమే కర్ణాటక ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉన్నదని ఆయన వెల్లడించారు. బీఆర్ఎస్ పోటీలో లేక పోవడమే అక్కడ కాంగ్రెస్ గెలుపుకు దోహద పడిందన్న అంశాన్ని విస్మరించ రాదన్నారు.