mt_logo

కేంద్ర ప్రభుత్వ పీఎం మిత్ర పథకానికి తెలంగాణే స్ఫూర్తి

  • కిటెక్స్, గణేషా కంపెనీలు పనులు ప్రారంభం
  • నల్ల బంగారం ఉంది. తెల్ల బంగారం కూడా ఉంది

వరంగల్, జూన్ 17: వరంగల్ కాకతీయ మెగా టెక్స్ట్ టైల్ పార్క్ లో యంగ్ వన్  కంపెనీ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి, చేనేత శాఖల మంత్రి కేటీఆర్. ఈ సభలో ఆయన మాట్లాడారు. నల్ల బంగారం ఉంది. తెల్ల బంగారం కూడా ఉంది. ఇక్కడ పండే పత్తి అత్యుత్తమ, నాణ్యమైనది. సిరిసిల్ల, కొడకండ్ల లలో నేతన్నలు అందుకే ఉన్నారు. అందుకే సీఎం కేసీఆర్ పట్టుబట్టి గతంలో అజమ్ జాహీ మిల్లు ఉన్న ప్రాంతంలోనే కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ను ఏర్పాటు చేశారు. పార్క్ కోసం తమ స్థలాలను ఇచ్చిన రైతులకు పరిహారంగా ఆగస్టు 15లోగా ఆయా రైతుల కుటుంబాలకు అభివృద్ధి పరచిన 100 గజాల స్థలాన్ని ఇవ్వాలి. ఫామ్ టూ ఫ్యాషన్ అనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ మెగా పార్క్ లో ఉత్పత్తులను త్వరగా ప్రారంభించి, ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించాలి. కిటెక్స్, గణేశా కంపెనీలు పనులు ప్రారంభించారు. 99 శాతం ఉద్యోగాలు స్థానికులకే, కాగా, అందులో 80 శాతం ఉద్యోగాలు మహిళలకు వచ్చేలా కృషి జరుగుతోంది.

అంతర్జాతీయ స్థాయి దుస్తులు ఇక్కడ తయారీ అవుతాయి. మేడ్ ఇన్ పరకాల, మేడ్ ఇన్ వరంగల్  బట్టలు ప్రపంచానికి ఎగుమతి కానున్నాయి. ప్రపంచ దుస్తుల ఉత్పాదన లో బంగ్లాదేశ్ లో 8 శాతం, శ్రీలంకలో 7 శాతం బట్టలు తయారీ అవుతుండగా దేశంలో కేవలం 4 శాతం బట్టలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. దేశంలోని కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొంది, పీఎం మిత్ర అనే పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ పీఎం మిత్ర పథకానికి తెలంగాణ స్ఫూర్తి. మన మిషన్ భగీరథ, రైతు బంధు వంటి అనేక పథకాలను కేంద్రం కాపీ కొట్టిందని చెప్పారు. అభివృద్ధిలో తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని యంగ్‌ వన్‌ కంపెనీ చైర్మన్‌ చాంగ్‌ జాయ్‌ బొక్‌ అన్నారు.