mt_logo

తెలంగాణ బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా అభివృద్ధి చెందుతుంది- మహారాష్ట్ర ప్రతినిధి బృందం

తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధి పైన అధ్యయనం చేసేందుకు మహారాష్ట్ర నుంచి 250 మందితో కూడిన రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధుల బృందం హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నది. ఈరోజు మహారాష్ట్ర ప్రతినిధుల బృందంతో మంత్రి కె. తారక రామారావు టీహబ్‌లో సమావేశం అయ్యారు. హైదరాబాద్ నగర ప్రగతి పైన వారికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వం గత పది సంవత్సరాలలో చేపట్టిన ప్రణాళిక బద్ధమైన కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..   తెలంగాణ అభివృద్ధి గురించి తెలుసుకోవడానికి నగరానికి విచ్చేసిన మహారాష్ట్ర ప్రతినిధులకు స్వాగతమని పేర్కొన్నారు. 

తెలంగాణ బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా అభివృద్ధి చెందుతుంది- మహారాష్ట్ర ప్రతినిధి బృందం

హైదరాబాద్ నగరం గత పది సంవత్సరాలలో అద్భుతంగా అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రం ఏర్పాటు కన్నా ముందు హైదరాబాద్ నగరంలో ఉన్న పరిస్థితి తమకు గుర్తుంది అన్నారు. పరిపాలకులకు సరైన విజన్ ఉంటే, నగరం కానీ రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది అనడానికి, తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ గత పది సంవత్సరాలలో సాధించిన ప్రగతి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు అన్నారు.సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం బుల్లెట్ ట్రైన్ వేగాన్ని మించి అభివృద్ధి చెందుతుందని ప్రశంసలు కురిపించారు. తెలంగాణ రాష్ట్ర విధానాలు, కార్యక్రమాల ద్వారా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిన విధానం గురించి అనేక అంశాలను తెలుసుకున్నామని మహారాష్ట్ర ప్రతినిధి బృందం తెలిపింది.