mt_logo

దేశ ఆర్థిక వ్యవస్థకు దక్షిణాదే పునాది – తలసరి ఆదాయంలో తెలంగాణదే అగ్రస్థానం

• టాప్-5లో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, కేరళ రాష్ట్రాలు

 • తలసరి ఆదాయంలో తెలంగాణదే అగ్రస్థానం పన్ను ఆదాయ వనరుల్లో రెండో స్థానం ఆర్బీఐ నివేదిక 2022-23లో వెల్లడి

 దక్షిణాది రాష్ట్రాలే భారతదేశ ఆర్థిక వెన్నెముకని, దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (జీడీపీ) దేశ స్థూల ఉత్పత్తి లో 30% కన్నా ఎక్కువ ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్బీఐతో పాటు వివిధ రాష్ట్రాల ఆర్థిక సర్వేలు ఈ మేరకు వెల్లడించాయి. ఈ నివేదికల ప్రకారం తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు పలు ఆర్థిక సూచీల్లో ముందు వరుసలో నిలిచాయి. టాప్ 5లో రెండు తెలుగు రా రాష్ట్రాలు.. దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే పలు అంశాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానాల్లో నిలిచాయి. జీడీపీలో తమిళనాడు (రూ.24.8 లక్షల కోట్లు) మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో కర్నాటక (22.4లక్షల కోట్లు), తెలంగాణ (13.3లక్షల కోట్లు), ఆంధ్రప్రదేశ్ (13.2లక్షల కోట్లు), కేరళ (రూ.10లక్షల కోట్లు) నిలిచాయి. 

2022-23 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం విషయానికొస్తే తెలంగాణ రూ. 2,75,443తో అగ్ర స్థానంలో ఉంది. ఆ తర్వాత కర్నాటక (రూ.2,65,623), తమిళనాడు (రూ.2,41,131), కేరళ (రూ.2,30,601), ఆంధ్రప్రదేశ్ (రూ. 2,07,771) తొలి ఐదు స్థానాలు దక్కిం చుకున్నాయి. జీడీపీతో పోలిస్తే అప్పుల్లోనూ తెలం గాణ అతి తక్కువతో మొదటి స్థానంలో నిలిచింది. స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో తెలంగాణ 25.3 శాతం, కర్ణా టక 27.5 శాతం, తమిళనాడు 27.7 శాతం, ఆంధ్ర ప్రదేశ్ 32.8 శాతం, కేరళ 37.2 శాతం అప్పులు కలిగి ఉన్నాయని నివేదికలు వెల్లడించాయి. రాష్ట్ర పన్నుల ఆదాయంలోనూ తెలుగు రాష్ట్రాలు మంచి ప్రతిభ కనబరుస్తున్నాయని నివేదికలు చెబుతు న్నాయి. తమిళనాడులో అత్యధికంగా రూ.1.26 కోట్ల పన్ను ఆదాయం రాగా, ఆ తర్వాత కర్నాట కలో రూ.1.11 కోట్లు, తెలంగాణలో రూ.92,910 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో రూ.85,265 కోట్లు, కేరళ రూ.71,833 కోట్లు వచ్చినట్టు నివేదికలు తెలి పాయి. వడ్డీల చెల్లింపుల్లో కూడా తెలంగాణ 11.3 శాతం, ఆంధ్రప్రదేశ్ 14.3 శాతం, కర్ణాటక 14.3 శాతం, కేరళ 18.8 శాతం, తమిళనాడు 21 శాతంతో దేశంలోనే తక్కువ వడ్డీ చెల్లిస్తున్న రాష్ట్రాలుగా నిలిచాయి.