నార్త్ కరోలినా రాష్ట్రంలోని చార్లేట్ నగరంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు NRI TRS USA అద్వర్యంలో ఘనంగా జరిగాయి. అమరవీరులను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించి కార్యక్రమాన్ని ప్రారంభిచారు. వెంగల్ జలగం సభకు అధ్యక్షత వహించారు. వెంగల్ మాట్లాడుతు కేసీఆర్ గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిలే కాకుండ తెలంగాణ ప్రజల కోసమని వాటర్ గ్రిడ్, నిరంతరాయంగా విద్యుత్ సరఫర, స్వచ్చ హైదరాబాద్, మహిళల రక్షణకు షీ టీమ్స్ లాంటి కార్యక్రమాల్ని చేపట్టారని అన్నారు. అనతరం అవతరణ దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి పారడైస్ బిర్యానీ పాయింట్ వారు భోజన ఏర్పాట్లు చేసారు. చార్లేట్ తెలంగాణ సంఘం నాయకులు దేవేందర్, తెరాస నాయకులు చేన్నుమల్లు, రామకిషన్ రావు రిటైర్డ్ (E&C), బాల్ రెడ్డి(రిటైర్డ్ MEO), నరసింహ, రమణ కొట్టే, గణేష్ ముషిని, రమణ గొనె, రఘు మహావడి, నవీన్ చిట్టి, ప్రమోద్ మహంకాళి, క్రాంతి కోట, వంశీ, గోకుల్, ప్రదీప్, రవికాంత్, వెంకట్ ఎర్రవెల్లి తదితరులు పాల్గొన్నారు.