మినియాపోలిస్ నగరంలో ఎన్నారై తెరాస ఆద్వర్యంలో ఘనంగా అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నాగేందర్ మహీపతి గారు సభకు అద్యక్షత వహించారు. నాగేందర్ గారు మాట్లాడుతూ కే.టి.ఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ రానున్న ఐదు సంవత్సరాలలో ఐ.టి మరియు పారిశ్రామిక రంగంలో భారతదేశంలో అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు. మినియాపోలిస్ ప్రాంత ఎన్నారైలు కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఎన్నారై తెరాస నాయకులు సకృ నాయక్, నిరంజన్ అల్లమనేని, జ్ఞానేశ్వర్ కాచం, భావనిరాం, విజయ్ పాల్గొన్నారు.