- భారతదేశంలో తెలంగాణ ఈ-గవర్నెన్స్ లో ప్రథమ స్థానం
- ప్రజల సహకారం ఉంటే హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోవడం సాద్యం
హైదరాబాద్,జూన్ 10: ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా పని చేస్తున్న ఏ ప్రభుత్వమైనా ప్రజల ప్రశంసలు పొందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భావిస్తారని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది దినోత్సవాల్లో భాగంగా తెలంగాణ సుపరిపాలన దినోత్సవం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం హైదరాబాద్లోని హైటెక్స్ లో జరిగింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేయనున్న వార్డు ఆఫీస్ కార్యక్రమం పైన జరిగిన అవగాహన శిక్షణ సమావేశంలో ప్రసంగించిన మంత్రి కేటీఆర్.. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో స్వపరిపాలన వచ్చింది. సుపరిపాలన కూడా రావాలన్నది ముఖ్యమంత్రి గారి లక్ష్యం, అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు వేగంగా పరిపాలన సంస్కరణలను చేపట్టారని అన్నారు. పురపాలన అంటే పౌరుల భాగస్వామ్యంతో జరిగేదే నగర పరిపాలన అని కేసీఆర్ గారు భావిస్తారు, నాలుగు కోట్లు ఉన్న రాష్ట్ర జనాభాలో దాదాపు కోటి 25 లక్షల మంది హైదరాబాద్ పట్టణంలో ఉన్నారు.. హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిదన్నారు.
ప్రజల సహకారం ఉంటే హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోవడం సాద్యం
తెలంగాణ రాష్ట్రం లక్ష్యా పన్నెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటే హైదరాబాద్ నగరం 675 చదరపు కిలోమీటర్లు, ఇక్కడ ఉన్న 675 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోనే 25 శాతానికి పైగా రాష్ట్ర జనాభా కేంద్రకృతమైంది, పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు వేగంగా తీసుకెళ్లడం కోసం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, నూతన పూరపాలికలు, గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశామని గుర్తు చేసారు. దేశంలో మూడు శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం 30% జాతీయ అవార్డులను గెలుచుకుంటుంది ప్రజల కనీస అవసరాలు తీర్చి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది, హైదరాబాద్ నగరంలో ఒక వార్డు అంటే ఒక మున్సిపాలిటితో సమానమైన జనాభా ఉంది.. కానీ ఇన్ని రోజులలో ఒక మున్సిపాలిటీ కి ఉన్నంత సిబ్బందికి గాని లేదా ఇతర సదుపాయాలు కానీ వార్డులో లేవన్నారు. అందుకే ప్రజల సమస్యల పరిష్కారానికి, మరింత ఉన్నతమైన సేవలు అందించేందుకు వార్డులో కనీసం పది మందితో వివిధ విభాగాలతో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజల సహకారం ఉంటే హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోవడం సాధ్యమవుతుందని అన్నారు.
చెరువులను కాపాడుకునే కార్యక్రమాలను కొనసాగించండి
వార్డు కార్యాలయం ద్వారా ఆచరణాత్మకమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకుపోదామని అధికారులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. 2014 నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్ నగరం గణనీయమైన మార్పులు సాధించింది. ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్క జీహెచ్ఎంసీ అధికారికి ధన్యవాదాలు, నగరంలో నేడు రోజుకు 8000 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరుగుతుంది, సెప్టెంబర్ నాటికి పూర్తిస్థాయిలో లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తున్న నగరంగా హైదరాబాద్ నిలువబోతుంది. ఇది మనందరికీ గర్వకారణం అని అన్నారు. ప్రభుత్వం నిర్మించిన ప్రతి భవనాన్ని వినియోగంలోకి తీసుకురండి. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో కలిసి పని చేయండి చెరువులను కాపాడుకునే కార్యక్రమాలను కొనసాగించండన్నారు. ప్రతి శనివారాన్ని రీతింగ్ డే గా జరుపుకుందాం. రెడ్యూస్, రీసైకిల్, రియూస్ 3R మంత్రాన్ని పాటిద్దామన్నారు.
ప్రజలు ఇచ్చిన ఫిర్యాదును రిజిస్ట్రేషన్ చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసే వ్యవస్థగా వార్డ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి వార్డ్ కార్యాలయానికి ఇన్చార్జిగా ఉంటారన్నారు. ఆయన కింద పది మంది అధికారులు పనిచేస్తారు, వార్డు కార్యాలయంలోని సిబ్బంది జీహెచ్ఎంసీ కి కనులు, చెవులు, ముక్కు మాదిరి పని చేయాలన్నారు. ఒకవేళ స్థానిక వార్డు కార్యాలయానికి కాకుండా ఇతర వార్డు కార్యాలయంలో ప్రజలు ఫిర్యాదు చేస్తే, వాటిని స్వీకరించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది, ప్రభుత్వ కార్యాలయాలు లేదా జీహెచ్ఎంసీ విభాగాలతో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత వార్డు అధికారులపై ఉంటుందన్నారు. ప్రతి వార్డులో ఉండే ఇంజనీరింగ్ సిబ్బంది రోడ్లు, డ్రైనేజీల వంటి వాటి నిర్వహణ మరమ్మత్తు కార్యక్రమాలు పరిశీలించాల్సి ఉంటుంది, ప్రతి వార్డులో ఉండే టౌన్ ప్లానింగ్ సిబ్బంది భవన నిర్మాణం సక్రమంగా జరుగుతుందో లేదో చూడటం, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, భవన నిర్మాణ నిబంధనల అమలు వంటి కార్యక్రమాలను చూసుకోవాలన్నారు. మహిళలకు, ఈరోజు మహిళా సంఘాలకు ఉపయుక్తంగా ఉండేలా వార్డు కమ్యూనిటీ ఆఫీసర్ ని ఏర్పాటు చేసుకుంటున్నాం అని గుర్తు చేసారు.
భారతదేశంలో తెలంగాణ ఈ-గవర్నెన్స్ లో ప్రథమ స్థానం
తాగునీటి సరఫరా మురుగునీటి నిర్వహణకు సంబంధించి జలమండలి నుంచి వార్డ్ అసిస్టెంట్ ఉంటారు, విద్యుత్ శాఖకు సంబంధించిన ఒక ఆధికారి వార్డ్ లైన్ మెన్ కూడా ఉంటారని చెప్పారు. వార్డ్ కార్యాలయంలో ఒక కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఉంటారు, వార్డు కార్యాలయం కోసం ప్రస్తుతం తీసుకున్న భవనాల స్థానంలో నూతన భవనాలను కూడా కట్టిస్తాం.. భారతదేశంలో తెలంగాణ ఈ-గవర్నెన్స్ లో ప్రథమ స్థానంలో ఉంది, వార్డు కార్యాలయానికి సంబంధించిన సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఫిర్యాదు చేసే ప్రజలకు అవకాశం ఇస్తాము, ప్రజలు ఇచ్చిన ఫిర్యాదును నిర్ణీత కాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం.. రానున్న కొద్ది నెలలపాటు వార్డు కార్యాలయ వ్యవహారాలను జోనల్ కమిషనర్లు లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు.
వార్డు కార్యాలయంలో బాద్యతలు నిర్వహించే సిబ్బందికి తమ తమ విభాగాల అధిపతులు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, వాళ్ళకు మార్గదర్శనం చేయాలి, వార్డ్ కార్యాలయాల్లో బాధ్యతలు నిర్వహించనున్న అధికారులు ప్రజలతో మమేకమై పనిచేయాలి. మనం ప్రజల సేవకులమనే విషయాన్ని గుర్తించుకొని మనం ప్రజలతో మెలగాలి, ఆ తీరుగా పనిచేయాలని సూచించారు. 16 తేదీన పట్టణ ప్రగతి దినోత్సవం రోజున 150 ప్రాంతాల్లో ఒకేసారి వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తాం.. వార్డ్ అధికారుల జాబ్ చార్టుతో పాటు పౌరుల పిర్యాదులను ఎంత కాలంలో పరిష్కరిస్తామో చెప్పే సిటిజన్ చార్టర్ ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ పథకాలను, పాలసీలను దేశంలోని కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. కాపీ కొడుతున్నాయని అన్నారు. మనం తీసుకురానున్న వార్డు కార్యాలయ వ్యవస్థ కూడా దేశంలో ఎక్కడా లేదు ఇదే ప్రథమం, ఈ వ్యవస్థను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క అధికారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది విజయవంతమైన తరువాత దీన్ని ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, నగరపాలికులు కచ్చితంగా ఆదర్శంగా తీసుకుంటాయన్న నమ్మకం నాకున్నదన్నారు.