mt_logo

ధాన్యం ఉత్పత్తిలో, వైద్యుల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది : మంత్రి హరీశ్ రావు

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా వైద్యారోగ్య పురోగతుల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి హరీశ్ రావు స‌మాధానం ఇచ్చారు.  తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో ఐదు మెడికల్ కళాశాలలు మాత్రమే ఉండేవి. 2008లో రిమ్స్, 2013లో నిజామాబాద్ మెడికల్ కళాశాలలు గులాబీ జెండా ఒత్తిడితో వచ్చాయన్నారు. 9 ఏళ్లలో 29 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. వైట్ కోట్ రెవల్యూషన్ తీసుకొచ్చాం. దేశం మొత్తం సీట్లు 2,220 మెడికల్ సీట్లు ఉంటే.. 900 సీట్లు ఒక్క తెలంగాణలో ఉన్నాయంటే 43 శాతం ఎంబీబీఎస్ సీట్లను తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. దేశం మొత్తం వైద్యులను సరఫరా చేసే స్థాయికి తెలంగాణ చేరుకుందని గుర్తు చేసారు.  ధాన్యం ఉత్పత్తిలో, వైద్యుల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది. ‘ బీ ‘ కేటగిరీలో కూడా తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తున్నాం. కోర్టు నుంచి అనుమతి వస్తే అధునాతన ఉస్మానియా ఆసుపత్రి కడతాం… కొత్తగా మెడికల్ కళాశాలలో చేరే విద్యార్థులకు ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధించామని తెలిపారు. ఒకేసారి 852 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేపట్టాం. కొత్తగా వచ్చే 8 మెడికల్ కళాశాలలు వచ్చే విద్యా సంవత్సరం ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.