mt_logo

ప‌దేండ్ల పండుగ‌..కుల‌వృత్తుల‌కు ల‌క్ష‌ణంగా అండ‌గా

  • వృత్తిదారుల‌కు రాష్ట్ర స‌ర్కారు ఆర్థిక చేయూత‌
  • కుంటుప‌డ్డ కుల‌వృత్తుల‌కు జీవం పోస్తున్న కేసీఆర్‌

హైద‌రాబాద్‌: ఉమ్మ‌డి రాష్ట్రంలో పాల‌కుల ప‌ట్టింపులేమితో కులవృత్తులు కునారిల్లిపోయాయి. కుమ్మ‌రి, క‌మ్మ‌రి, నేత‌, కంసాలి, ర‌జ‌క‌, గౌడ వృత్తిదారులు ప‌నిలేక కూలీలుగా మారిపోయారు. కుల‌వృత్తిని దైవంగా భావిస్తూ కొంత‌మంది ప‌స్తుల‌తో నెట్టుకొచ్చారు. అయితే, స్వ‌రాష్ట్రంలో వారి త‌ల‌రాత‌లు మారిపోయాయి. అప్ప‌టిదాకా ఉమ్మ‌డి పాల‌కులు కేవ‌లం ఓటు బ్యాంకుగా మాత్ర‌మే చూసిన కుల‌వృత్తిదారుల‌కు స్వ‌రాష్ట్రంలో కేసీఆర్ పెద్ద‌పీట‌వేశారు. గీత కార్మికుల‌కు 50 ఏండ్ల‌కే పింఛ‌న్‌, చెట్టుప‌న్ను ర‌ద్దు, గౌడ బీమా, మ‌త్స్య‌కారుల‌కు ఉచితంగా చేప పిల్ల‌ల పంపిణీ, ర‌జ‌కుల‌కు దోబీఘాట్ల నిర్మాణం, ఉచిత క‌రెంట్‌, నాయీ బ్రాహ్మ‌ణుల దుకాణాల‌కు ఫ్రీ క‌రెంట్‌.. గొల్ల కుర్మ‌ల‌కు జీవాల పంపిణీ.. ఇలా ఆ వ‌ర్గాల బాగుకోసం చేయాల్సిందంతా చేశారు. ఇన్ని చేసినా స్వ‌రాష్ట్రంలో ముందుండి పాల్గొన్న కుల‌వృత్తిదారుల‌కు ఇంకా ఏదో చేయాల‌న్న త‌ప‌న‌తో తెలంగాణ ప‌దేండ్ల పండుగ‌ను పుర‌స్క‌రించుకొని సీఎం కేసీఆర్ వారిపై వ‌రాల జ‌ల్లు కురిపించారు. కుల‌వృత్తిదారుల‌కు రూ. ల‌క్ష ఆర్థిక సాయం చేయాల‌ని నిర్ణ‌యించారు. దీనికి అవ‌స‌ర‌మైన విధివిధానాల‌ను వెంట‌నే రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. సీఎం కేసీఆర్ తీసుకొన్న నిర్ణ‌యంతో కుల‌వృత్తిదారులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. మా దేవుడు కేసీఆర్ అంటూ పొగుడుతున్నారు. ఇప్ప‌టికే కుల‌వృత్తుల‌కు జీవం పోసేందుకు ఎంతో చేసిన కేసీఆర్ ఇప్పుడు రూ.ల‌క్ష ఆర్థిక సాయం ప్ర‌క‌టించ‌డం గొప్ప విష‌య‌మ‌ని అంటున్నారు. ఆ ల‌క్ష రూపాయ‌ల‌తో మా వృత్తిని ఇంకా అభివృద్ధి చేసుకొంటామ‌ని చెప్తున్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఆనందంగా పాలుపంచుకొంటామ‌ని అంటున్నారు.

కుల‌వృత్తుల‌కు ఎలా మేలు క‌లుగుతుందంటే?

  • నాయీ బ్రాహ్మణులకు రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచితంగా మీటర్లు పెట్టి కరెంటిస్తున్నరు. ఇప్పుడు రూ. లక్ష చొప్పున సాయం చేస్తామని ప్ర‌క‌టించారు. దీంతో నాయీబ్రాహ్మ‌ణ వృత్తిని అభివృద్ధి చేసుకొనేందుకు అధునాత‌న ప‌రికరాలు కొనుగోలు చేసుకోవ‌చ్చు.
  • గౌడ కులస్తులకు 50 ఏండ్ల‌కే పింఛన్లతోపాటు గీత‌కార్మిక బీమా అందిస్తున్నరు. ఇక ఇప్పుడు రూ. లక్ష సాయం అందితే గౌడ‌న్న‌ల కుటుంబాల‌కు దీమాగా కుల‌వృత్తి చేసుకోవ‌చ్చు.
  • నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఇప్ప‌టికే అందిస్తున్న ప్రోత్సాహంతో ఉత్సాహంగా పని చేస్తున్నారు. సబ్సిడీపై నూలు అందచేయడంతోపాటు 50 ఏండ్లు నిండిన నేత కార్మికుడికి ఆసరా పింఛన్‌ కూడా ఇస్తూ తెలంగాణ స‌ర్కారు అండగా నిలుస్తున్నది. ఇటీవల నేతన్నల కోసం రూ.5 లక్షల బీమా అమలు చేసింది. ఇప్పుడు రూ. ల‌క్ష ఆర్థిక సాయంతో నేత‌న్న‌లు కొత్త యూనిట్లు, మ‌ర‌మ‌గ్గాలు కొనుక్కొనేందుకు వీలు క‌లుగుతుంది.

తెలంగాణ వ‌చ్చిన‌ప్పుడు మ‌త్స్య‌కారుల‌కు స‌రైన జీవ‌నోపాధి లేదు. వారి త‌ల‌రాత మార్చేందుకు సీఎం కేసీఆర్ చెరువులు, కుంటల్లో ఉచితంగా చేప పిల్లలను పోసి భరోసానిచ్చారు. ఇప్పుడు చేపలు పట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇప్పుడు ఇచ్చే ల‌క్ష‌తో చేప‌లు ప‌ట్టే ప‌రిక‌రాలు..వాటిని అమ్మేందుకు అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు ఏర్పాటు చేసుకొని వృత్తిని అభివృద్ధి చేసుకోవ‌చ్చు

  • స్వ‌రాష్ట్రంలో ర‌జ‌కుల కోసం ఊరూరా దోబీఘాట్లు క‌ట్టించారు. నీటి సౌక‌ర్యం క‌ల్పించారు. ఇస్త్రీ దుకాణాలు న‌డిపే వారికి ఉచిత క‌రెంటును అందిస్తున్నారు. రూ. ల‌క్ష సాయం అందితే ర‌జ‌కులు అధునాత‌న వాషింగ్ మెషీన్లు, ఇస్త్రీ చేసేందుకు అవ‌స‌ర‌మైన సామ‌గ్రిని కొనుగోలు చేసుకోవ‌చ్చు.
  • స్వ‌రాష్ట్రంలో గొల్ల, కుర్మ‌ల‌కు తెలంగాణ స‌ర్కారు ఉచితంగా గొర్రెలు, మేక‌ల‌ను పంపిణీ చేసింది. దీంతో రాష్ట్రంలో మూగ‌జీవాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. గొల్ల‌కుర్మ‌లకు చేతినిండా ప‌ని, డ‌బ్బులు ల‌భించాయి. ఇప్పుడు అందే ల‌క్ష‌తో మ‌రిన్ని మూగ‌జీవాల‌ను కొనుగోలు చేసి, వాటి సంఖ్య‌ను పెంచుకొనే వీలుంటుంది.
  • స‌మైక్య పాల‌న‌తో చితికిపోయిన కుల‌వృత్తుల్లో కుమ్మ‌రి, విశ్వ‌బ్రాహ్మ‌ణ, మ‌హేంద్ర (మ్యాద‌రి) ముందుంటాయి. ఇప్ప‌టికే ప‌లు సంక్షేమ ప‌థ‌కాల‌తో ల‌బ్ది పొందుతున్న వీరికి రూ. ల‌క్ష ఆర్థిక‌సాయం ఎంతో తోడ్పాటును అందిస్తుంది. ఈ మొత్తంతో త‌మ కులవృత్తిని అభివృద్ధి చేసుకొని..అధునాత‌నంగా మ‌ళ్లీ కొత్త దుకాణాలు తెరిచే వీలుంటుంది.