mt_logo

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన 84 గ్రామాల ప్రజాప్రతినిధులు 

హైద‌రాబాద్, మే 23: హైద‌రాబాద్ చుట్ట‌ప‌క్క‌ల ప్రాంతాల అభివృద్ధికి గుదిబండగా మారిన జీవో 111ను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని సోమవారం సచివాలయంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో 111 జీవో పరిధిలోని 84 గ్రామాల ప్రజాప్రతినిధులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ 111 జీవోను ఎత్తివేసి, మాట నిలుపుకొన్నారని వారంతా సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతోపాటు 111 జీవో పరిధిలోని గ్రామాల మండలాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.